ఇవాల్టి నుంచి కొత్త పార్లమెంట్ భ‌వ‌నంలో సమావేశాలు.. ఎంపీలకు స్పెషల్‌ గిఫ్ట్స్

బ్యాగులో రాజ్యాంగం, కొత్త, పాత పార్లమెంట్ భవనాల చిత్రాలతో కూడిన స్టాంపులు, స్మారక నాణెం, కొత్త పార్లమెంట్‌కు సంబంధించిన బుక్‌లెట్‌ ఉంటుందని తెలుస్తోంది.

Advertisement
Update:2023-09-19 08:17 IST

పార్లమెంట్‌ నూతన భవనంలో సమావేశాలకు అంతా రెడీ అయింది. ఇవాల్టి నుంచి పార్లమెంట్ స్పెషల్‌ సెషన్స్‌ కొత్త భవనంలోనే జరగనున్నాయి. ఈ ప్రత్యేక సందర్భానికి గుర్తుగా ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం స్పెషల్‌ గిఫ్ట్ బ్యాగ్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సమావేశానికి హాజరయ్యే ప్రతి ఎంపీకి ఈ గిఫ్ట్ బ్యాగులు అందించనున్నారు. ఇప్పటికే ఈ గిఫ్ట్ బ్యాగులకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం.. ఈ బ్యాగులో రాజ్యాంగం, కొత్త, పాత పార్లమెంట్ భవనాల చిత్రాలతో కూడిన స్టాంపులు, స్మారక నాణెం, కొత్త పార్లమెంట్‌కు సంబంధించిన బుక్‌లెట్‌ ఉంటుందని తెలుస్తోంది. ప్రతి బ్యాగుపై సంబంధిత ఎంపీ పేరు ముద్రించి ఉంటుందని సమాచారం. ఇక ప్రధాని మోడీ సైతం కొత్త పార్లమెంట్‌కు రాజ్యాంగ ప్రతిని తీసుకెళ్తారని, ఎంపీలు సైతం ఆయనను అనుసరిస్తారని తెలుస్తోంది.

ఐదు రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు సెప్టెంబర్‌ 18 నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు సమావేశాలు పార్లమెంట్ పాత భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో పాటు ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు పాత పార్లమెంట్‌లో చివరి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మోడీ 75 ఏళ్ల స్వతంత్ర భారత ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News