లాయర్లు రాసిన తీర్పులనే కోర్టులు చదువుతున్నాయి

సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకపోయినా దాడులు చేయిస్తున్నారని ఆక్షేపించారు.

Advertisement
Update:2023-09-01 10:36 IST

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ న్యాయ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ న్యాయ వ్యవస్థలో భయంకరమైన అవినీతి దాగి ఉందన్నారు. తీర్పులు కూడా కొందరు లాయర్లే రాసేస్తున్నారని ఆరోపించారు. లాయర్లు రాసి ఇచ్చిన తీర్పుల‌నే న్యాయమూర్తులు చదువుతున్నారని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఇలాంటి ఉదంతాలు తన దృష్టికి వచ్చాయని కూడా చెప్పారు. అసలు న్యాయవ్యవస్థలో ఏం జరుగుతోంది..?. కింది కోర్టుల నుంచి పై కోర్టుల వరకు ఏం జరుగుతోంది అన్న దానిపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు.

బీజేపీ పాలనతో న్యాయవ్యవస్థ ప్రమాదంలో ప‌డింద‌న్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకపోయినా దాడులు చేయిస్తున్నారని ఆక్షేపించారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఉంటుందని, కానీ న్యాయమూర్తిగా ఒక్కసారి నియమితులైన తర్వాత వారితో తాను ఎలాంటి సంబంధాలు పెట్టుకోనన్నారు అశోక్ గెహ్లాట్‌.

Tags:    
Advertisement

Similar News