లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌

ప్రతిపక్ష నేతగా ఎంపికైన వ్యక్తి పబ్లిక్ అకౌంట్స్‌, పబ్లిక్ అండర్ టేకింగ్‌, అంచనాల కమిటీతో పాటు జాయింట్ పార్లమెంటరీ సహా కీలక కమిటీలలో సభ్యుడిగా ఉంటారు.

Advertisement
Update: 2024-06-26 04:04 GMT

స్పీకర్‌ ఎన్నిక ముందు కాంగ్రెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీని ప్రకటించింది. ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ కోరగా.. అందుకు రాహుల్‌ అంగీకరించారు. అనంతరం రాహుల్‌ను లీడర్‌ ఆఫ్‌ అపోజిషన్‌గా ఎంపిక చేసినట్లు ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మెహతాబ్‌కు లేఖ రాసింది కాంగ్రెస్‌. ఇండియా కూటమి సభ్యులు సైతం ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీ పేరును బలపరిచారు.

గత పదేళ్లలో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి హోదా ఇదే తొలిసారి. 2014, 2019లో ప్రతిపక్ష హోదాకు అవసరమైన 10 శాతం అంటే 54 సీట్ల మార్కును కాంగ్రెస్‌ చేరుకోలేదు. 2014లో 42, 2019లో 52 స్థానాలకే పరిమితమైంది. ఐతే ఈ సారి 99 స్థానాలు సాధించడంతో ప్రతిపక్ష హోదా సాధించింది.

ఇక రాహుల్‌ గాంధీ ఐదోసారి ఎంపీగా గెలిచారు. ఇటీవల వయనాడ్‌, రాయబరేలీ స్థానాల నుంచి ఎంపీగా గెలిచిన ఆయన.. వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. ప్రతిపక్ష నేతగా ఎంపికైన వ్యక్తి పబ్లిక్ అకౌంట్స్‌, పబ్లిక్ అండర్ టేకింగ్‌, అంచనాల కమిటీతో పాటు జాయింట్ పార్లమెంటరీ సహా కీలక కమిటీలలో సభ్యుడిగా ఉంటారు. అంతే కాకుండా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, సీబీఐ, నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్‌, లోక్‌పాల్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ లాంటి రాజ్యాంగబద్ధమైన సంస్థల చీఫ్‌ల ఎంపిక కమిటీలలో ప్రధానితో పాటు ప్రతిపక్ష నేత సభ్యునిగా ఉంటారు. 

Tags:    
Advertisement

Similar News