పెరిగిన గడ్డం, కాబోయే భార్య.. రాహుల్ ఆసక్తికర ఇంటర్వ్యూ

గడ్డం వల్ల చిన్నచిన్న ఇబ్బందులున్నాయని, తినేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఉందన్నారు. చాలామంది పార్టీ నాయకులు తనను షేవింగ్ చేసుకోవాలని కోరారని కూడా చెప్పారు రాహుల్.

Advertisement
Update:2023-01-23 14:58 IST

రాహుల్ మీ పెళ్లెప్పుడు..?

ఈ ప్రశ్న వందలసార్లు మీడియా ప్రతినిధులనుంచి రాహుల్ గాంధీకి ఎదురయ్యే ఉంటుంది. సమయానుకూలంగా సమాధానం చెప్పి దాటవేస్తుంటారే కానీ ఆయన సూటిగా ఎప్పుడూ స్పందించలేదు. ఆ మాటకొస్తే తనకు కావాల్సిన అమ్మాయి క్వాలిటీస్ ఇవీ.. అంటూ కూడా ఆయనెప్పుడు చెప్పలేదు. అయితే తాజాగా ఆయన కర్లీ టేల్స్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆహారం, కొత్తగా వచ్చిన గడ్డం, తన జీవితంలోకి రాబోయే భాగస్వామి.. ఇలా చాలా విషయాలపై ఆసక్తిగా స్పందించారు.

అన్నీ తింటాను, కానీ..!

నాకు ఏది పెడితే అది తింటాను అన్నీ నాకు ఇష్టం అంటున్న రాహుల్ గాంధీ.. కారం తక్కువగా తింటానని చెప్పారు. అంతే కాదు పనస, బఠానీ వంటివి అస్సలు తినబోనని, అవంటే తనకు ఇష్టం లేదన్నారు. నాన్ వెజ్ విషయానికొస్తే చికెన్, మటన్, సీ ఫుడ్ లో అన్ని రకాల వెరైటీలు లాగించేస్తానన్నారు. తెలంగాణ వంటకాలు కాస్త స్పైసీగా ఉంటాయని చెప్పుకొచ్చారు రాహుల్.

మాసిన గడ్డం..

యాత్ర పూర్తయ్యే వరకు తాను జుట్టు కత్తిరించుకోకూడదని, షేవింగ్ చేసుకోకూడదని అనుకున్నట్టు తెలిపారు రాహుల్ గాంధీ. తన గడ్డం ఇప్పుడు కాస్త పెరిగిందని, ఇంకా పెరుగుతుందన్నారు. గడ్డం వల్ల చిన్నచిన్న ఇబ్బందులున్నాయని, తినేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఉందన్నారు. చాలామంది పార్టీ నాయకులు తనను షేవింగ్ చేసుకోవాలని కోరారని కూడా చెప్పారు రాహుల్.

కాబోయే భార్య..

కాబోయే భార్య గురించి కూడా ఆసక్తికర కామెంట్ చేశారు రాహుల్ గాంధీ. తనకు కాబోయే భార్యకు ప్రత్యేకంగా ఫలానా క్వాలిఫికేషన్ ఉండాలని తాను అనుకోవడంలేదని చెప్పారు. అయితే అందరితో కలుపుగోలుగా ఉండే తెలివైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు తెలిపారు రాహుల్. 

Tags:    
Advertisement

Similar News