భారత్ పరువు తీసింది మోదీయే.. నేను కాదు

విదేశాలకు వెళ్లినప్పుడు భారత్ పరువు తీసే వ్యక్తి మోదీ అనేది మాత్రం వాస్తవం అని అన్నారు రాహుల్ గాంధీ. స్వాతంత్య్రం వచ్చిన దగ్గరి నుంచి దేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ ఆయన చేసిన ప్రసంగం తనకింగా గుర్తుందని చెప్పారు.

Advertisement
Update:2023-03-06 17:13 IST

లండన్ పర్యటనలో రాహుల్ గాంధీ భారత్ పరువు తీస్తున్నారంటూ ఇటీవల బీజేపీ నేతలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్ కౌంటర్ ఇచ్చారు. విదేశాల్లో భారత్ పరువు తీసింది తాను కాదని, ఆ పని చేసింది మోదీయేనని క్లారిటీ ఇచ్చారు.

‘స్వాతంత్య్రం వచ్చిన 60 నుంచి 70 ఏళ్లలో భారత్ లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విదేశాల్లో ప్రధాని మోదీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు రాహుల్ గాంధీ. అప్పట్లో భారీగా అవినీతి జరిగిందని ఆయన చెప్పడం తనకింకా గుర్తుందని అన్నారు. ఆయన లాగా తానెప్పుడూ భారత్ పరువు తీయలేదని వివరించారు. అలా చేయాలన్న ఆలోచన తనకు లేదన్నారు. తన మాటలను వక్రీకరించడం బీజేపీకి ఇష్టం అని చెప్పారు రాహుల్ గాంధీ.

విదేశాలకు వెళ్లినప్పుడు భారత్ పరువు తీసే వ్యక్తి మోదీ అనేది మాత్రం వాస్తవం అని అన్నారు రాహుల్ గాంధీ. స్వాతంత్య్రం వచ్చిన దగ్గరి నుంచి దేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ ఆయన చేసిన ప్రసంగం తనకింగా గుర్తుందని చెప్పారు. ఆ మాటలతో ఆయన భారతీయులను అవమానించారని గుర్తు చేశారు.

అప్పట్లో దుబాయ్ లో మోదీ..

2015లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దుబాయ్ లో మోదీ చేసిన ప్రసంగం అప్పట్లో విమర్శలు దారి తీసింది. భారత్ లో అప్పటికే ఉన్న సమస్యలన్నిటికీ గతంలో పనిచేసిన ప్రభుత్వాలే కారణం అంటూ మోదీ దుయ్యబట్టారు. ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుబట్టింది. భారత్ లో పుట్టినందుకు అప్పట్లో చాలామంది చింతించేవారని, విదేశాలకు వలస వెళ్లేవారని చెప్పారు మోదీ. దానిపై ఇప్పుడు రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. తాను అలాంటి నిందలేవీ వేయలేదన్నారు. భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ ఇటీవల లండన్ లోని కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. విదేశాల్లో భారత్ పరువు తీశారంటూ మండిపడింది. పాకిస్తాన్ సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని, విదేశాల్లో రాహుల్ భారత్ పరువు తీశారని అంటున్నారు బీజేపీ నేతలు. రాహుల్ ఇచ్చిన కౌంటర్ కి బీజేపీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News