సమాధిపై QR కోడ్.. స్కాన్ చేస్తే ఏం జరుగుతుందంటే..?

కేరళలోని త్రిశూర్ లో చర్చి పక్కనే ఉన్న శ్మశానంలో ఓ సమాధిపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. అదిప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

Advertisement
Update:2023-03-23 10:51 IST

సమాధులపై పేరు, ఊరు, పుట్టిన తేదీ, చనిపోయిన తేదీ రాయడం కామన్. మరికొంతమంది చనిపోయిన వారి గుణగణాల్ని పొగుడుతూ కవితలు రాస్తుంటారు. వారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. కానీ కేరళలోని త్రిశూర్ లో చర్చి పక్కనే ఉన్న శ్మశానంలో ఓ సమాధిపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది స్కాన్ చేస్తే డాక్టర్ ఇవిన్ ఫ్రాన్సిస్ కి చెందిన వీడియోలు ప్రత్యక్షమవుతాయి.

ఎవరీ ఇవిన్..?

కేరళకు చెందిన ఫ్రాన్సిస్, లీలా అనే దంపతులు ఒమన్ లో స్థిరపడ్డారు. వారి అబ్బాయే ఇవిన్ ఫ్రాన్సిస్. డాక్టర్ కోర్స్ పూర్తి చేసిన ఇవిన్ 26ఏళ్లకే చనిపోయాడు. బ్యాడ్మింటన్ ఆడుతూ ఉన్నట్టుండి కుప్పకూలాడు. అతడి సమాధిని కేరళలోని త్రిశూర్ లో ఏర్పాటు చేశారు తల్లిదండ్రులు. అయితే ఆ సమాధిపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఇవిన్ సోదరి ఎవ్లిన్ ఫ్రాన్సిస్ కి వచ్చింది. ఆమె ఓ వెబ్ సైట్ క్రియేట్ చేసి, ఆ లింక్ కి క్యూఆర్ కోడ్ జతచేసి ఇవిన్ సమాధిపై దాన్ని చెక్కించారు. ఆ సమాధిపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇవిన్ కి సంబంధించిన వీడియోలు కనపడతాయి.

రెండేళ్ల క్రితం ఇవిన్ సమాధి, క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసినా.. ఇటీవలే సోషల్ మీడియా ద్వారా ఈ విషయం బాగా పాపులర్ అయింది. డాక్టర్ ఇవిన్ మల్టీటాలెంటెడ్. క్రీడలు, సంగీతం, డ్యాన్స్.. ఇలా అన్నిట్లో అతడికి ప్రవేశం ఉంది. ఎంతో హుషారుగా ఉండే వ్యక్తి. కానీ సడన్ గా బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలాడు. చిన్న వయసులోనే చనిపోయాడు. అతడి జ్ఞాపకాలతో తల్లిదండ్రులు ఇంకా బాధపడుతూనే ఉన్నారు. అతడి సమాధిపై ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ కాన్సెప్ట్ మాత్రం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇవిన్ కాలేజీలో చేసిన స్టేజ్ షో లు, గిటార్ వాయించే వీడియోలు, డ్యాన్స్ షో లు.. ఇలా అన్నిరకాల వీడియోలను ఒకేచోట పొందుపరిచి దానికి క్యూఆర్ కోడ్ జతచేసి, సమాధిపై ఉంచి తమ్ముడికి ఘన నివాళులర్పించింది ఇవిన్ సోదరి ఎవ్లిన్ ఫ్రాన్సిస్. 

Tags:    
Advertisement

Similar News