పూణే ర్యాష్ డ్రైవింగ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌..

పూణే టీనేజర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటికొస్తున్నాయి. నిందితుడైన మైనర్‌ బ్లడ్ శాంపిల్స్‌ టెస్ట్‌ రిపోర్టును ఇద్దరు డాక్టర్లు మార్చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement
Update:2024-05-27 14:37 IST

పూణే టీనేజర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటికొస్తున్నాయి. నిందితుడైన మైనర్‌ బ్లడ్ శాంపిల్స్‌ టెస్ట్‌ రిపోర్టును ఇద్దరు డాక్టర్లు మార్చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈమేరకు సాసూన్‌ ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ అజేయ్‌ తావ్‌రే, డాక్టర్‌ శ్రీహరి హార్నూర్‌ను పూణే క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

యాక్సిడెంట్‌ జరిగాక అబ్జర్వేషన్‌ హోమ్‌లో ఉన్న నిందితుడి రక్త నమూనాలను పరీక్షించిన ఈ డాక్టర్లు.. ఎలాంటి ఆల్కహాల్‌ ఆనవాళ్లు లేవని నివేదిక ఇచ్చారు. అనుమానం వచ్చిన పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించారు.

అందులో నిందితుడు ఫ్రెండ్స్‌తో కలిసి మందు తాగుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. బ్లడ్‌ టెస్ట్‌ సమయంలో మైనర్‌ శాంపిల్స్‌ను పడేసి.. మరో వ్యక్తి నమూనాలను వీరు అక్కడ పెట్టినట్లు పోలీసులు నిర్ధారించారు.

కేసును తప్పుదోవ పట్టించేందుకు..

కేసును తప్పుదోవ పట్టించేందుకు మొదట్నుంచీ తీవ్ర యత్నాలు జరుగుతున్నాయి. నిందితుడి తండ్రి నగరంలో బడా రియల్టర్‌. దీంతో కేసు నుంచి కొడుకును తప్పించేందుకు కుటుంబీకులు తీవ్ర యత్నాలు చేశారు.

డ్రైవర్‌ను ఈ కేసులో ఇరికించేందుకు నిందితుడి తండ్రి, తాత తీవ్రస్థాయిలో యత్నించారు. దీంతో మైనర్‌ తాతను ఇప్పటికే అరెస్ట్ చేశారు. అంతేకాదు కొందరు పోలీసులను కూడా నిందితుడి ఫ్యామిలీ ప్రభావితం చేసింది. దీంతో ఇద్దరు అధికారులపై వేటువేశారు. తాజాగా ఫోరెన్సిక్‌ పరీక్షలు చేసే వైద్యులు కూడా రక్తనమూనాలను తారుమారు చేయడం ఆందోళనకరంగా మారింది.

Tags:    
Advertisement

Similar News