బాలుడి డ్రైవింగ్‌తో ఇద్దరు మృతి.. బెయిల్‌ ఇస్తూనే.. కండిషన్లు విధించిన న్యాయస్థానం

మహారాష్ట్రలోని పుణెలో ఆదివారం ఓ లగ్జరీ కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులకు డ్రైవ్‌ చేసిన నిందితుడు మైనర్‌ అని తేలింది. దీంతో అతన్ని జువైనల్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ కేసులో న్యాయస్థానం అతనికి బెయిల్‌ మంజూరు చేసింది.

Advertisement
Update:2024-05-20 16:15 IST

మద్యం తాగి నిర్లక్ష్యంగా కారు డ్రైవ్‌ చేసి ఇద్దరి ప్రాణాలు బలితీసుకున్న ఘటనలో నిందితుడిగా ఉన్న బాలుడికి జువైనల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే.. అందుకు కొన్ని షరతులు విధించింది. ఆ షరతులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మహారాష్ట్రలోని పుణెలో ఆదివారం ఓ లగ్జరీ కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులకు డ్రైవ్‌ చేసిన నిందితుడు మైనర్‌ అని తేలింది. దీంతో అతన్ని జువైనల్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ కేసులో న్యాయస్థానం అతనికి బెయిల్‌ మంజూరు చేసింది. అయితే అందుకు పలు షరతులు విధించింది.

ఆ షరతులు ఏంటంటే..

జరిగిన ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పనిచేయాలని షరతుల్లో భాగంగా న్యాయస్థానం బాలుడికి ఆదేశించింది. అంతేకాదు.. మానసిక నిపుణుడి వద్ద చికిత్స తీసుకోవాలని, భవిష్యత్తులో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే బాధితులకు సాయం చేయాలని సూచించింది. నిందితుడిని మేజర్‌గా పరిగణించి దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరగా.. న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. బెయిల్‌ నిరాకరించడానికి కారణాలు కనిపించడం లేదని కోర్టు ఈ సందర్భంగా పేర్కొన్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు.

పబ్‌కి వెళ్లి.. మద్యం తాగి..

ఇక ఈ కేసులో నిందితుడు ఓ ప్రముఖ బిల్డర్‌ కుమారుడని తెలిసింది. ఇటీవలే అతను 12వ తరగతి పూర్తి చేశాడు. శనివారం తన స్నేహితులతో కలిసి పోర్షే కారులో పబ్‌కి వెళ్లాడు. అక్కడ మద్యం కూడా సేవించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆదివారం తెల్లవారుజామున పబ్‌ నుంచి తిరిగి వస్తుండగా వాహనం నియంత్రణ కోల్పోయి ఎదురుగా వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల స్వస్థలం రాజస్థాన్‌ అని పోలీసులు వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News