భారత్ కు చేరుకున్న ప్రధాని మోడీ
ఫ్రాన్స్, అమెరికా పర్యటన ముగించుకుని రాత్రి 11 గంటల సమయంలో ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి ప్రధాని;
Advertisement
ఫ్రాన్స్, అమెరికా పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్రమోడీ భారత్‌కు చేరుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ద్వైపాక్షి చర్చలు జరిపిన తర్వాత వాయు సేనకు చెందిన ప్రత్యేక విమానంలో మోడీ బయలుదేరారు. రాత్రి 11 గంటల సమయంలో ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో పారిస్ వేదికగా జరిగిన ఆర్టిఫిషయల్ ఇంటలీజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి ప్రధాని మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి సహాఅధ్యక్షుడిగా వ్యవహరించారు. అమెరికాతో వాణిజ్యం, రక్షణ, సాంకేతిక రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
Advertisement