మణిపూర్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న

మ‌ణిపూర్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించారు

Advertisement
Update:2025-02-13 20:25 IST

మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇటీవలే ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. మణిపూర్‌లో మైతేయి, కుకీ వర్గాల మధ్య గ‌త రెండేళ్లుగా తీవ్ర అశాంతి నెలకొని తీవ్ర స్ధాయిలో ఘర్షణలు జరుగుతున్నాయి. అయితే సీఎం వర్గానికి కొమ్ము కాస్తున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేలే విమర్శించారు.

గ‌త రెండేళ్లుగా తీవ్ర అశాంతి నెలకొన్న బీజేపీ పాలిత మణిపూర్‌లో బీరేన్‌ సింగ్‌ ఆదివారం త‌న ప‌ద‌వికి రాజీనామా చేయడంతో రాజకీయంగా అనిశ్చితి ఏర్పడింది. సోమవారం నుంచి జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను రద్దు చేస్తూ గవర్నర్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. బీరేన్‌ సింగ్‌ తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరినీ ఎంపిక చేయాలో బీజేపీ అధిష్ఠానం తేల్చుకోలేకపోతున్నది. దీంతో కేంద్రానికి రాష్ట్రపతి పాలన విధించడమొక్కటే ప్రత్యామ్నాయంగా క‌నిపించిన‌ట్లు ఉంది.

Tags:    
Advertisement

Similar News