ప్రధాని విదేశీ పర్యటన నేపథ్యంలో ఉగ్ర బెదిరింపు కాల్‌

ప్రధాని నరేంద్రమోడీ ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకుంటామని వారు బెదిరించినట్లు పేర్కొన్న పోలీసులు

Advertisement
Update:2025-02-12 11:40 IST

ప్రధాని మోడీ విదేశీ పర్యటన నేపథ్యంలో ఉగ్ర బెదిరింపు కాల్ వచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ముంబయి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకుంటామని వారు బెదిరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని వెంటనే పోలీసులు భద్రతా సంస్థలతో పంచుకున్నారు. ఫోన్‌కాల్‌ చేసిన వ్యక్తిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఫోన్‌ చేసిన వ్యక్తి మానసిక స్థితి సరిగాలేదని పోలీసులు తెలిపారు.

ప్రధాని మోడీ సోమవారం నాలుగు రోజుల విదేశీ పర్యటనకు బయల్దేరారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉన్న ఆయన కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సులో పాల్గొన్నారు. పారిస్‌ పర్యటనను ముగించుకుని నేడు అమెరికా బయల్దేరనున్నారు. రెండురోజుల పాటు అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ కానున్నారు.

Tags:    
Advertisement

Similar News