అయోధ్య రామాలయ ప్రధాన పూజారి జల సమాధి
సరయు నదిలో అంతిమ సంస్కారం నిర్వహించిన కుటుంబ సభ్యులు
Advertisement
అయోధ్య రామాలయ ప్రధాన పూజరి ఆచార్య సత్యేంద్ర దాస్ పార్థీవ దేహానికి జలసమాధి నిర్వహించారు. తీవ్ర అనారోగ్యంతో ఈనెల 3వ తేదీన లక్నోలోని ఒక ఆస్పత్రిలో చేరిన సత్యేంద్ర దాస్ బ్రెయిన్ స్ట్రోక్ తో పరిస్థితి విషమించి బుధవారం తుది శ్వాస విడిచారు. శాస్త్రోక్తంగా ఆయన పార్థీవ దేహానికి పూజలు చేసి సరయు నదిలో జల సమాధి చేశారు.
Advertisement