ప్రజ్వల్ రేవణ్ణ అరెస్టు.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో హైడ్రామా!

ప్రస్తుతం ప్రజ్వల్ రేవణ్ణ హసన్‌ ఎంపీగా ఉన్నారు. 2019లో హసన్‌ నుంచి గెలిచిన ప్రజ్వల్‌ ఈ సారి కూడా బీజేపీ కూటమి తరపున అక్కడి నుంచే బరిలో దిగారు.

Advertisement
Update:2024-05-31 07:25 IST

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు పోలీసులు గురువారం అర్ధరాత్రి దాటాక అరెస్టు చేశారు. జర్మనీ నుంచి తిరిగివచ్చిన ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్టు చేశారు. లైంగిక ఆరోపణల కేసుల్లో విచారించేందుకు సీఐడీ ఆఫీసుకు తరలించారు. గతంలో ఇండియాకు తిరిగివచ్చేందుకు రెండు ఫ్లైట్స్‌ బుక్‌ చేసుకుని ప్రజ్వల్ రేవణ్ణ క్యాన్సిల్ చేసుకున్నారని అధికారులు తెలిపారు.

మరోవైపు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ గురువారం ప్రజ్వల్‌ రేవణ్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను బెంగళూరులోని స్పెషల్‌ కోర్టు తిరస్కరించింది. ఇదే సమయంలో హసన్‌లోని ప్రజ్వల్ రేవణ్ణ ఇంటిలో సోదాలు చేసిన పోలీసులు నేరాలను బలపరిచే మెటిరీయల్‌ను స్వాధీనం చేసుకున్నారు.


అంతకుముందు జేడీఎస్ కురువృద్ధుడు దేవెగౌడ ప్రజ్వల్ రేవణ్ణను ఇండియాకు తిరిగి రావాలని హెచ్చరిస్తూ ప్రజ్వల్‌కు సందేశం పంపిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం ట్విట్టర్‌లో రేవణ్ణ ఓ వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో తన తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పిన రేవణ్ణ.. తనపై ప్రత్యర్థి పార్టీలు నమోదు చేసిన లైంగిక ఆరోపణల కేసులతో డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇండియాకు వచ్చి పోలీసులకు విచారణకు సహకరిస్తానని చెప్పారు. తనకు దేవుడి ఆశీస్సులు ఉన్నాయంటూ వీడియోలో చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ప్రజ్వల్ రేవణ్ణ హసన్‌ ఎంపీగా ఉన్నారు. 2019లో హసన్‌ నుంచి గెలిచిన ప్రజ్వల్‌ ఈ సారి కూడా బీజేపీ కూటమి తరపున అక్కడి నుంచే బరిలో దిగారు. అయితే ప్రజ్వల్‌ రేవణ్ణపై వచ్చిన ఆరోపణలపై ఇప్పటివరకూ బీజేపీ స్పందించలేదు.

హసన్‌లో పోలింగ్ ముగిసిన మరుసటి రోజే దౌత్యపరమైన పాస్‌పోర్టుతో మ్యూనిచ్‌కు వెళ్లిపోయారు రేవణ్ణ. అంతకుముందు రేవణ్ణకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో మహిళా కమిషన్‌ ఇచ్చిన ఫిర్యాదుతో సిట్‌ను ఏర్పాటు చేసి ప్రజ్వల్ రేవణ్ణపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Tags:    
Advertisement

Similar News