కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి వెళ్తున్న నాయకుణ్ణి విమానం దించి మరీ అరెస్టు చేసిన పోలీసులు
పవన్ ఖేరా బ్యాగేజ్ లో కొంత గందరగోళం ఉందని ఒక సారి కిందికి దిగాలని విమాన సిబ్బంది ఆయనకు చెప్పారు. ఆయన కిందికి దిగగానే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అది తెలియగానే ఆయనతో పాటు విమానంలో ప్రయాణం చేస్తున్న మరికొందరు కాంగ్రెస్ నాయకులు కూడా విమానం దిగిపోయారు.
చత్తీస్ గడ్ రాయ్ పూర్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి హాజరుకావడానికి బయలు దేరిన్ అకాంగ్రెస్ నేత పబన్ ఖేరా ను ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను విమానం ఎక్కిన తర్వాత కిందికి దింపి మరీ అరెస్టు చేశారు. ఈ సమయంలో విమానాశ్రయంలో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పవన్ ఖేరా బ్యాగేజ్ లో కొంత గందరగోళం ఉందని ఒక సారి కిందికి దిగాలని విమాన సిబ్బంది ఆయనకు చెప్పారు. ఆయన కిందికి దిగగానే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అది తెలియగానే ఆయనతో పాటు విమానంలో ప్రయాణం చేస్తున్న మరికొందరు కాంగ్రెస్ నాయకులు కూడా విమానం దిగిపోయారు. అరెస్టు వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ వారంతా విమానాశ్రయం లో ధర్నాకు దిగారు.
అయితే ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పవన్ ఖేరాను అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఈ అంశంపై అస్సాంలో ఆయన మీద కేసు నమోదయ్యింది. .
"మేమంతా IndiGo6E ఫ్లైట్ 6E 204లో రాయ్‌పూర్‌కి వెళ్తున్నాము. అకస్మాత్తుగా పవన్‌ఖేరాను డిప్లేన్ చేయమని అడిగారు" అని విమానంలో ఉన్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
“ఇది అప్రజాస్వామికం , వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తారా ? ఇది ఏ ప్రాతిపదికన, ఎవరి ఆజ్ఞ ప్రకారం జరుగుతోంది? '' అని ఆమెప్రశ్నించారు.