జీ-20 సమ్మిట్‌ సక్సెస్‌.. ఢిల్లీ పోలీసులకు అరుదైన గౌరవం

ఢిల్లీ సీపీ సంజయ్ అరోరాతో పాటు మరో 450 మంది పోలీసు సిబ్బంది ఉంటారని తెలుస్తోంది. ఈ విందుకు జీ-20 సమ్మిట్ నిర్వహించి భారత్‌ మండపం వేదిక కానుంది.

Advertisement
Update:2023-09-13 16:39 IST

జీ-20 సమ్మిట్‌ను సక్సెస్‌ చేయడంలో భాగమైన ప్రతి ఒక్కరి కృషిని గుర్తించాలని నిర్ణయించారు ప్రధాని నరేంద్రమోడీ. ఇందులో భాగంగా ఈ వారం ఢిల్లీ పోలీసు సిబ్బందితో ప్రధాని డిన్నర్ చేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జీ-20 సమావేశాల్లో అద్భుతమైన పనితీరు క‌న‌బ‌ర్చిన వారి జాబితా తయారు చేయాలని ఇప్పటికే ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ అరోరాను ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఈ జాబితాలో ఢిల్లీ సీపీ సంజయ్ అరోరాతో పాటు మరో 450 మంది పోలీసు సిబ్బంది ఉంటారని తెలుస్తోంది. ఈ విందుకు జీ-20 సమ్మిట్ నిర్వహించి భారత్‌ మండపం వేదిక కానుంది. ఇక ఈ వారం ప్రారంభంలో జీ-20 సమ్మిట్‌ కోసం పనిచేసిన కొంత మంది పోలీసు సిబ్బందికి సీపీ అరోరా ప్రశంసా ప‌త్రాలు అందించారు. ఇలా సిబ్బంది, కార్మికుల శ్రమను, కృషిని ప్రధాని మోడీ గుర్తించడం ఇదే తొలిసారి కాదు. గతంలో పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం టైంలోనూ దాని నిర్మాణంలో పాల్గొన్న కార్మికులను స్వయంగా సత్కరించారు ప్రధాని మోడీ.

ఇక సమ్మిట్‌కు ముందు, సమ్మిట్ జరుగుతున్న టైంలోనూ ఢిల్లీ పోలీసులు చాలా తీవ్రంగా శ్రమించారు. అమెరికా, బ్రిటన్‌ సహా వివిధ దేశాధినేతలు ఢిల్లీకి రావడంతో సెక్యూరిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. హై లెవల్‌ సెక్యూరిటీ కోసం స్పెషల్‌ ప్రొటెక్షన్ గ్రూప్‌, ఢిల్లీ పోలీసులు వివిధ దేశాలు ప్రతినిధులు బస చేసిన హోటళ్లకు ప్రత్యేకమైన కోడ్‌ పదాలు ఉపయోగించారు. యూఎస్‌ ప్రెసిడెంట్ బైడెన్ బస చేసిన ఐటీసీ మౌర్య షెరటన్‌కు పండోరా అనే కోడ్‌ను ఉపయోగించారు. ఇక యూకే ప్రధాని రిషి సునాక్‌ బస చేసిన షాంగ్రి-లా కు సమారా అనే కోడ్‌ ఉపయోగించారు. రాజ్‌ఘాట్‌కు రుద్‌పూర్‌ అని, శిఖరాగ్ర సమావేశం జరిగిన ప్రగతి మైదాన్‌ను నికేతన్‌ అని పిలిచారు.

Tags:    
Advertisement

Similar News