మే చివరి వారంలో రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు!
ఈ డబ్బులు అందుకోవాలంటేవడానికి రైతులు ఈ-కేవైసీ పూర్తి చేయాలి. ఇందుకోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులైన రైతులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం 17వ విడత నిధులను మే చివరి వారంలో రైతుల ఖాతాలో వేయనుంది. 16వ విడత నిధుల్ని ఈ ఫిబ్రవరిలోనే కేంద్రం వేసింది. మొత్తం రూ. 21వేల కోట్లకు పైగా నిధులను మహారాష్ట్రలోని యవత్‌మాల్‌లో జరిగిన సమావేశంలో లబ్ధిదారులకు ప్రధాని మోడీ అందజేశారు.
రూ.3 లక్షల కోట్లకు పైగా జమ
2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అర్హులైన రైతు కుటుంబాలకు నాలుగు నెలలకు రూ.2వేల చొప్పున ఏడాదికి మూడుసార్లు మొత్తం రూ. 6 వేలు అందిస్తారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ మోడ్ (డీబీటీ) లో నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేస్తున్నారు. ఇప్పటి వరకు 11 కోట్లకుపైగా రైతుల ఖాతాలకు 3 లక్షల కోట్లకు పైగా నిధులు జమ చేశారు.
ఈకేవైసీని అప్డేట్ చేయాలి.
ఈ డబ్బులు అందుకోవాలంటేవడానికి రైతులు ఈ-కేవైసీ పూర్తి చేయాలి. ఇందుకోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అక్కడ ఆధార్ నంబర్ వేసి, సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ నమోదు చేసి గెట్ మొబైల్ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటపీఈ ఎంటర్ చేసి, సబ్మిట్ ఫర్ అథెంటికేషన్ బటన్ క్లిక్ చేస్తే పీఎం కిసాన్ అప్‌డేట్ పూర్తవుతుంది.