దేశవ్యాప్తంగా మద్యపాన నిషేధం కోరుతూ పిటిషన్... - పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా మద్యపాన నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది.
దేశవ్యాప్తంగా మద్యపాన నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలోకి రాదంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ మేరకు తమ ముందుకు వచ్చిన పిటిషన్ను సోమావరం జస్టిస్ లలిత్ బెంచ్ కొట్టేసింది.
జాతీయ స్థాయిలో మద్యపాన నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో ఇటీవలే ఓ పిటిషన్ దాఖలైంది. దేశవ్యాప్తంగా మద్యపాన నిషేధంపై విధానం రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలని సదరు పిటిషన్ను దాఖలు చేసిన వ్యక్తి కోర్టును కోరారు. ఈ పిటిషన్ సోమవారం జస్టిస్ లలిత్ ధర్మాసనం ముందుకు రాగా... ఇది సుప్రీంకోర్టు పరిధిలోకి రాదన్న జస్టిస్ లలిత్... పిటిషన్ను కొట్టివేశారు.