జమ్మూకాశ్మీర్‌లో ప్రశాంతంగా రెండో విడత పోలింగ్.. ఎంత శాతం జరిగిందంటే..?

జమ్మూకాశ్మీర్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి.

Advertisement
Update:2024-09-25 21:08 IST

జమ్మూకాశ్మీర్‌లో రెండో విడత శాసన సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. రెండో దశలో ఆరు జిల్లాల పరిధిలోని 26 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. 25 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించారు. శ్రీనగర్ జిల్లాలోని ఎనిమిది స్థానాలకు ఓటింగ్ జరిగింది. రియాసిలో ఆరు, బుద్గామ్‌లో ఐదు, రియాసి, పూంచ్‌ జిల్లాల్లో మూడు చొప్పున, గందర్‌బల్‌లో రెండు స్థానాలకు ఓటింగ్ జరిగింది.బుధవారం సాయంత్రం 5 గంటల వరకు జమ్మూకాశ్మీర్‌లో 54 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా రియాసి జిల్లాలో 71.81 శాతం ఓటింగ్‌ నమోదు కాగా, శ్రీనగర్‌ జిల్లాలో అత్యల్పంగా 27.31 శాతం ఓటింగ్‌ రికార్డయ్యింది.

అంతకుముందు మధ్యాహ్నం 3 గంటల వరకు 46.12 శాతం ఓటింగ్ జరిగింది. అదే సమయంలో, మధ్యాహ్నం 1 గంట వరకు, మొత్తం కేంద్ర పాలిత ప్రాంతంలో 36.93 శాతం ఓటింగ్ జరిగింది. అంతకుముందు ఉదయం 11 గంటల వరకు 24.10 శాతం ఓటింగ్ జరిగింది.సెప్టెంబర్ 18న మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దాదాపు 60 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయింది. రెండో విడుత కూడా దాదాపు అదే విధంగా కొనసాగింది. మూడో విడుత మిగిలిన అన్నీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. అక్టోబర్ 08న ఫలితాలు వెలువడనున్నాయి.

Tags:    
Advertisement

Similar News