విపక్షాల ఐక్యతా ప్రయత్నాలు.. త్వరలో కేసీఆర్ ను కలవనున్న నితీశ్ కుమార్..?

కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటిస్తున్న వివిధ పార్టీల నాయకులను కలవాలని భావిస్తున్న నితీశ్ కుమార్ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ను కలిశారు. అనంతర‍ం తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్‌ చీఫ్ కేసీఆర్, బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీలను త్వరలోనే కలసి చర్చలు జరపాలని నితీశ్ కుమార్ భావిస్తున్నారు.

Advertisement
Update:2023-04-15 07:57 IST

బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ విపక్షాలను ఐక్యం చేయడం కోసం తన‌ ప్రయత్నాలను వేగ‌వంతం చేశారు. ఇప్పటికే ఢిల్లీలో బుధవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో సమావేశమైన ఆయన గురువారం సీపీఐ నేతలతో భేటీ అయ్యారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటిస్తున్న వివిధ పార్టీల నాయకులను కూడా కలవాలని భావిస్తున్న నితీశ్ కుమార్ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ను కలిశారు. అనంతర‍ం తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్‌ చీఫ్ కేసీఆర్, బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీలను త్వరలోనే కలసి చర్చలు జరపాలని నితీశ్ కుమార్ భావిస్తున్నారు.

బీజేపీ ని ఓడించడం కోసం ప్రతిపక్షాలు ఏకమవుతాయని నితీశ్ అన్నారు. ఇప్పటికే అనేక పక్షాలతో తాను చర్చించానని, ఐక్యంగా బీజేపీపై పోరాడటానికి వారంతా సిద్దంగా ఉన్నారని, నితీశ్ జేడీ(యూ) కార్యకర్తల సమావేశంలో అన్నారు. 

Tags:    
Advertisement

Similar News