అప్పుడు పేపర్‌ లీకులు.. ఇప్పుడు వాటర్‌ లీకులు

భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని వాయిదా తీర్మానంలో ప్రతిపాదించారు. బయట పేపర్ లీకులు, లోపల వాటర్ లీకులు జరుగుతున్నాయంటూ మోడీ సర్కారుపై సెటైర్లు వేశారు మాణిక్కం ఠాగూర్.

Advertisement
Update:2024-08-01 10:58 IST

నరేంద్రమోడీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనంలో వాటర్ లీక్ అవడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఏడాదికే లీకేజీలు బయటపడటంపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రపతి ఛాంబర్‌ దగ్గరి లాబీలో నుంచి నీరు కారుతోంది. పార్లమెంట్ భవనం ముందు కూడా భారీగా నీరు ఆగింది. లీకేజీ వీడియోలను కాంగ్రెస్ ఎంపీలు నెట్టింట వైరల్ చేస్తున్నారు.


ఇదే ఇష్యూపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. పార్లమెంట్ భవనంపై కప్పు నుంచి వర్షపు నీరు లీకవ్వడంపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని వాయిదా తీర్మానంలో ప్రతిపాదించారు. బయట పేపర్ లీకులు, లోపల వాటర్ లీకులు జరుగుతున్నాయంటూ మోడీ సర్కారుపై సెటైర్లు వేశారు మాణిక్కం ఠాగూర్.


ప్రధాని నరేంద్రమోడీ మే 28, 2023న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. రూ.970 కోట్లతో 4 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ప్రారంభించిన ఏడాదికే లీకేజీలు బయటపడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News