'ద్వేషం మార్కెట్‌లో ప్రేమ దుకాణం తెరిచా': బీజేపీకి రాహుల్ గాంధీ పంచ్

నిన్న రాజస్థాన్ లోని అల్వార్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ , ''మీరు నన్ను ద్వేషిస్తారు, మీరు నన్ను అవమానిస్తారు, మీ హృదయం విద్వేష దుకాణం కానీ నా దుకాణం ప్రేమతో కూడుకున్నది'' అని అ వ్యాఖ్యానించారు.

Advertisement
Update:2022-12-20 11:24 IST

రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పై విమర్శలు చేస్తున్న, హేళన చేస్తున్న బీజేపీ నాయకులపై రాహుల్ గాంధీ పంచ్ వేశారు. పాదయాత్రలతో ఓట్లు రాలవని, భారత్ జోడో కాదు కాంగ్రెస్ జోడో యాత్ర చేపట్టాలంటూ రకరకాలుగా రాహుల్ గాంధీని ఎద్దేవా చేస్తున్నారు బీజేపీ నాయకులు. ఈ నేపథ్యంలో "నేను విద్వేషాల బజారులో ప్రేమ దుకాణాన్ని తెరుస్తున్నాను. నేను ఈ యాత్ర ఎందుకు చేస్తున్నాను అని అడిగే బిజెపి నాయకులకు ఇది నా సమాధానం" అంటూ ఘాటైన సమాధానం ఇచ్చారు రాహుల్ గాంధీ.

భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాజస్థాన్ లో సాగుతోంది. నిన్న రాజస్థాన్ లోని అల్వార్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ అక్కడ జరిగిన సమావేశంలో మాట్లాడుతూ , ''మీరు నన్ను ద్వేషిస్తారు, మీరు నన్ను అవమానిస్తారు, మీ హృదయం విద్వేష దుకాణం కానీ నా దుకాణం ప్రేమతో కూడుకున్నది'' అని బీజేపీ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు."ద్వేషపూరిత మార్కెట్‌లో ప్రేమను వ్యాప్తి చేయడానికి దుకాణాలు తెరవండి" అని తనను లక్ష్యంగా చేసుకున్న బిజెపి నాయకులను కోరారు.

ఈ దేశం ప్రేమతో నిండి ఉన్నది ద్వేషంతో కాదు. చివరకు బీజేపీ నాయకులైనా సరే ఎప్పటి కైనా ప్రేమవైపు రావల్సిందే అని అన్నారు రాహుల్ గాంధీ.

Tags:    
Advertisement

Similar News