ఆన్ లైన్ ఆర్డర్లలో రికార్డ్ బ్రేక్.. నిమిషానికి 186 బిర్యానీలు, 139 పిజ్జాలు
నేషన్స్ బిగ్గెస్ట్ ఫుడీ గా ఢిల్లీకి చెందిన అంకుర్ అనే కస్టమర్ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఐటీ కంపెనీలో పనిచేసే అంకుర్ 2022లో మొత్తం 3330 ఫుడ్ ఆర్డర్లు ఇచ్చాడు.
2022లో టాప్-7 సిటీస్ లో ఇళ్ల అమ్మకాలు సరికొత్త రికార్డ్ లు సృష్టించిన విషయం తెలిసిందే. అంతే కాదు 2022 మరిన్ని రికార్డ్ లకు కూడా వేదికగా మారింది. ఆన్ లైన్ లో ఫుడ్ డెలివరీ ఈ ఏడాది రికార్డ్ స్థాయికి చేరుకుంది. కరోనా సమయంలో కూడా ఆన్ లైన్ డెలివరీలు పుంజుకున్నాయి, ఆ తర్వాత ఆ అలవాటు కొనసాగింది. అందుకే ఆన్ లైన్ ఆర్డర్లు ఈ ఏడాది ఫుడ్ డెలివలీ సంస్థలకు భారీ లాభాలను చేకూర్చాయి.
సగటున నిమిషానికి 186 బిర్యానీలు..
జొమాటో సంస్థ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఆన్ లైన్ లో అత్యథిక ఆర్డర్లు బిర్యానీకోసమే చేశారు కస్టమర్లు. సగటున నిమిషానికి 186 బిర్యానీల ఆర్డర్లను జొమాటో డెలివరీ చేసింది. ఆ తర్వాతి స్థానం పిజ్జాలది. సగటున నిమిషానికి 139 పిజ్జాలను డెలివరీ బాయ్స్ గమ్య స్థానాలకు చేర్చారు.
ది నేషన్స్ బిగ్గెస్ట్ ఫుడీ
నేషన్స్ బిగ్గెస్ట్ ఫుడ్ గా బిర్యానీ రికార్డ్ సాధిస్తే, నేషన్స్ బిగ్గెస్ట్ ఫుడీ గా ఢిల్లీకి చెందిన అంకుర్ అనే కస్టమర్ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఐటీ కంపెనీలో పనిచేసే అంకుర్ 2022లో మొత్తం 3330 ఫుడ్ ఆర్డర్లు ఇచ్చాడు. అంటే రోజుకి సగటున 9 ఆర్డర్లు ఇచ్చాడు. పిజ్జాలు, బిర్యానీలు, చివరకు కూల్ డ్రింక్ లు, ఐస్ క్రీమ్ లు కూడా ఆన్ లైన్లో ఆర్డర్లు ఇచ్చి తెప్పించుకునేవాడు అంకుర్. ఏడాది పొడవునా అతను ఇంటిఫుడ్ అసలు తినలేదట. అంతా ఆన్ లైన్ ఆర్డర్లతోనే కడుపు నింపుకునేవాడు.