ఒక వ్యక్తి, ఒకే భావజాలం దేశాన్ని అభివృద్ది చేయదు - మోహన్ భగవత్

''ప్రపంచంలోని గొప్ప‌ దేశాలు రక‌ రకాల ఆలోచనలను కలిగి ఉంటాయి. వారు అన్ని రకాల వ్యవస్థలను కలిగి ఉన్నారు. వారు అనేక వ్యవస్థల వల్లనే అభివృద్ధి చెందుతున్నారు, ”అని భగవత్ అన్నారు.

Advertisement
Update:2023-02-15 14:14 IST

ఒక వ్యక్తి ఆలోచన లేదా ఒక సమూహం ఆలోచన దేశాన్ని అభివృద్ది చేయదు లేదా విచ్ఛిన్నం చేయదు. అనేక రకాల ఆలోచనలను కలిగి ఉన్న దేశాలే గొప్ప‌ దేశాలుగా ఉన్నాయని, అన్ని రకాల వ్యవస్థలు నడవడం ద్వారా దేశాలు అభివృద్ధి చెందుతాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మోహన్ భగవత్ అన్నారు.

“ఒక వ్యక్తి, ఒక ఆలోచన, ఒక సమూహం, ఒక భావజాలం ఒక దేశాన్ని తయారు చేయలేవు లేదా విచ్ఛిన్నం చేయలేవు...ప్రపంచంలోని గొప్ప‌ దేశాలు రక‌ రకాల ఆలోచనలను కలిగి ఉంటాయి. వారు  అన్ని రకాల వ్యవస్థలను కలిగి ఉన్నారు. వారు అనేక వ్యవస్థల వల్లనే అభివృద్ధి చెందుతున్నారు, ”అని రాజ్‌రత్న పురస్కార్ సమితి నిర్వహించిన అవార్డు కార్యక్రమంలో భగవత్ అన్నారు.

భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ అనే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ప్రకటన చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రణాళిక కోసం వేదిక సిద్దం చేస్తున్నారు. దీనిని "దేశం యొక్క అవసరం" అని చెప్తున్నారు. ప్రతి నెలా ఎన్నికలు నిర్వహించడం అభివృద్ధి పనులపై ప్రభావం చూపుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. గత సంవత్సరం దేశవ్యాప్తంగా ఉన్న బిజెపి కార్యకర్తలతో పరస్పర చర్చ సందర్భంగా, ప్రధాని మోడీ ఈ ప్రణాళిక గురించి చెప్పారు. ఒక దేశం, ఒకే ఎన్నికలు సమయాన్ని, డబ్బును ఎలా ఆదా చేస్తుందో ఆయన వివరించారు.

ప్రతిపక్షాలు నరేంద్ర మోడీ ఒకే ఎన్నికలు విధానాన్ని వ్యతిరేకించాయి. ఈ అంశంపై నరేంద్ర మోడీపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఆరెస్సెస్ ఛీఫ్ వ్యాఖ్యలు మోడీకి షాక్ ఇవ్వనున్నాయి.

Tags:    
Advertisement

Similar News