ప్రధాని మోదీని కలిసిన ఒమర్ అబ్దుల్లా.. ప్రత్యేక హోదాపై వినతి
జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీలో అయ్యారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని అబ్దుల్లా కోరారు
జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీలో అయ్యారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ఒమర్ మంత్రివర్గం తీర్మానం చేసిన పత్రాన్ని ప్రధానికి అందజేశారు. అంతకు ముందు ఒమర్ అబ్దుల్లా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్‌లను కలిశారు. జమ్మూ కశ్మీర్‌లో రహదారులను అనుసంధానాన్ని పెంచాలని కోరారు. జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత తొలిసారి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్‌సీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది.
90 స్థానాల శాసనసభలో ఎన్‌సీ 42 సీట్లలో, కాంగ్రెస్ 6 స్థానాల్లో నెగ్గింది. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ ఇటీవల ఒమర్ కేబినెట్ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. దానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం కూడా తెలిపారు. తాజాగా భేటీలో ఆ తీర్మానాన్ని ప్రధానికి అందించారు