జమ్మూకశ్మీర్‌ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా అక్టోబర్‌ 16న ప్రమాణం

ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా

Advertisement
Update:2024-10-14 21:59 IST

జమ్మూకశ్మీర్‌ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. కొత్త సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా అక్టోబర్‌ 16న ప్రమాణం చేయనున్నారు. దీనికి సంబంధించి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఒమర్‌ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన మరుసటి రోజే తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌-కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించాయి. ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన మెజారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే ఎన్‌షీ శాసనసభ పక్ష నేతగా ఆపార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ ఎన్‌సీతో పాటు కాంగ్రెస్‌ నుంచి ఎల్జీకి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో అక్టోబర్‌ 16న నూతన ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ప్రమాణ స్వీకారానికి గవర్నర్‌ ఆహ్వానించారు. 

Tags:    
Advertisement

Similar News