జమ్మూకశ్మీర్‌ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణం

కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే,రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ తదితరులు

Advertisement
Update:2024-10-16 12:04 IST

జమ్మూకశ్మీర్‌ సీఎంగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) ఉపాధ్యక్షులు ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే,రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ తదితరులు

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించాయి. ప్రభుత్వ ఏర్పాటు అవసరమైన మెజారిటీ కూటమికి వచ్చింది. ఈ క్రమంలోనే ఎన్‌సీ శాసనసభ పక్ష నేతగా ఒమర్‌ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ ఎన్సీతో పాటు కాంగ్రెస్‌ ఎల్‌జీకి విజ్ఞప్తులు వచ్చాయి .దీంతో నేడు కొత్త ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ప్రమాణ స్వీకారానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆహ్వానించంతో ఈ కార్యక్రమం జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని మంత్రివర్గంలో కాంగ్రెస్ పార్టీ భాగమయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ప్రభుత్వానికి మాత్రం మద్దతుస్తామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్రపాలిత ప్రాంతానికి తొలి ముఖ్యమంత్రిగా ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకున్నది.

బైటి నుంచే మద్దతు: కాంగ్రెస్‌

ప్రస్తుతానికి మేము కొత్త ప్రభుత్వంలో చేరడం లేదని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్‌ తారిఖ్‌ హమీద్‌ కర్రా తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని కాంగ్రెస్‌ గట్టిగా డిమాండ్‌ చేసింది. ఆ హోదాను పునరుద్ధరిస్తామని ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార సభల్లో పదే పదే చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పటివరకు అది జరగలేదన్నారు. దీంతో తాము సంతోషంగా లేమని, అందుకే ప్రస్తుతానికి ప్రభుత్వంలో చేరడం లేదన్నారు. రాష్ట్ర హోదా కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చేరకపోవడానికి మరో కారణం ఉందని అక్కడి రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రభుత్వంలో చేరాలంటే కాంగ్రెస్‌ మూడు మంత్రి పదవులు ఆశించింది. ఆరు సీట్లు మాత్రమే గెలిచిన హస్తం పార్టీకి ఒక్కటే ఇస్తామని ఎన్సీ చెప్పిందట. దీంతో ప్రభుత్వంలో చేరడం కంటే బైటి నుంచి మద్దతు ఇవ్వడం మేలని ఆ పార్టీ భావించింది. అయితే ఎన్సీ-కాంగ్రెస్‌ ల మధ్య అంతా బాగానే ఉన్నదని ఒమర్‌ అబ్దుల్లా ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. 

Tags:    
Advertisement

Similar News