ఒమర్ అబ్దుల్లానే జమ్మూకశ్మీర్ సీఎం : ఫరూక్ అబ్దుల్లా

జమ్మూకశ్మీర్‌ లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆధిక్యం, గెలుపు కలిపి 43 స్థానాల్లో దూసుకెళ్తోంది. ఒమర్ అబ్దుల్లా జమ్మూకశ్మీర్ సీఎం అని నేషనల్ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్ అబ్ధుల్లా తెలిపారు.

Advertisement
Update:2024-10-08 14:44 IST

జమ్మూకశ్మీర్ ఎన్సీ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపధ్యంలో నేషనల్ కాన్పరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్ధుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్ధుల్లా జమ్మూకశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రి అని ఆయన ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌ లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆధిక్యం, గెలుపు కలిపి 43 స్థానాల్లో దూసుకెళ్తోంది. ఇక, బీజేపీ 28, పీడీపీ 2, కాంగ్రెస్‌ 7 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు 10 స్థానాల్లో (ఆధిక్యం/గెలుపు) కొనసాగుతున్నారు. ఇక్కడ, బీజేపీ, పీడీపీ ఒంటరిగా పోటీ చేశాయి. కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పొత్తులో ఉన్నాయి.

ప్రజాతీర్పును గౌరవించాలని, ఎలాంటి రాజకీయ కుట్రలు చేయొద్దని అన్ని పార్టీలను ఒమర్ అబ్దుల్లా కోరారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మేం విజయం సాధిస్తామనే ఆశాభావంతో ఉన్నాం. జమ్ముకశ్మీర్ ఓటర్లు తీసుకున్న నిర్ణయం కాసేపట్లో తెలుస్తుంది. కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత ఉండాలి. ప్రజల తీర్పు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే వారు ఎలాంటి కుయుక్తులకు పాల్పడవద్దు. బీజేపీ ఎలాంటి కుట్రల్లో భాగం కావొద్దు’’ అని వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే, రెండు అసెంబ్లీ స్థానాలు గండేర్బల్‌, బుడ్గామ్‌ నుంచి పోటీపడిన ఒమర్‌.. ప్రస్తుతానికి రెండుచోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News