బీజేపీ కాదు ''పిల్‌ మాస్టర్‌ గ్యాంగ్‌''

తీవ్ర విమర్శలు చేసిన కల్పనా సోరేన్‌

Advertisement
Update:2024-10-07 20:05 IST

బీజేపీపై జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌ సతీమణి కల్పనా సోరేన్‌ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రచార ర్యాలీలో సోమవారం ఆమె పాల్గొని మాట్లాడారు. పేదలకు, మహిళలకు తమ పార్టీ ప్రభుత్వం మంచి చేయాలని చూస్తే బీజేపీ కోర్టుల్లో ''పిల్‌' లు దాఖలు చేసి అడ్డు తగిలిందని మండిపడ్డారు. జార్ఖండ్‌ సీఎం మైయాన్‌ సమ్మాన్‌ యోజన్‌ పేరుతో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని చూస్తే కోర్టులో పిల్‌ వేసి అడ్డు తగిలిందన్నారు. హేమంత్‌ సోరేన్‌ ప్రవేశ పెట్టిన ప్రతి పథకానికి అడ్డు తగిలే పిల్‌ మాస్టర్‌ గ్యాంగ్‌ గా బీజేపీ మారిందన్నారు. గిరిజనుల సంస్కృతిని గుర్తించే కోడ్‌ ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీలో బిల్లు పెడితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డు తగిలిందన్నారు. జార్ఖండ్‌ లోని కొన్ని గిరిజన తెగలను రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌ లో చేర్చాలని కేంద్రానికి లేఖ రాసినా తిరస్కరించారని తెలిపారు. గిరిజనుల హక్కులు కాపాడేందుకు తమ పార్టీ పోరాడుతూనే ఉంటుందని హామీ ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News