నిత్యానందకు నాన్ బెయిలబుల్ వారెంట్

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఓ అత్యాచారం కేసులో కర్నాటకలోని ఓ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది.

Advertisement
Update:2022-08-20 10:13 IST

కర్నాటకలోని రామనగర సెషన్స్ కోర్టు వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందపై నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బిడబ్ల్యు) జారీ చేసింది. 2010లో జరిగిన ఓ అత్యాచారం కేసులో మూడవ‌ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు ఈ NBW జారీ చేసింది.

గతంలో నిత్యానందకు వ్యతిరేకంగా కోర్టు ఓపెన్-ఎండ్ వారెంట్ కూడా జారీ చేసింది, అయితే పోలీసులు అతని ఆచూకీని కనుగొనలేకపోయారు.

ఈ కేసులో ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. ముగ్గురు సాక్షులను కూడా విచారించారు, అయితే నిందితుడు నిత్యానంద పరారీలో ఉండటంతో గత మూడేళ్లుగా విచారణ నిలిచిపోయింది.

నిత్యానందపై అతని మాజీ డ్రైవర్ లెనిన్ ఫిర్యాదు మేరకు 2010లో అత్యాచారం కేసు నమోదైంది. నిత్యానందను అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు.

2020లో, నిత్యానంద దేశం నుంచి పారిపోయాడంటూ లెనిన్‌ పిటిషన్ వేయడంతో నిత్యానంద‌ బెయిల్‌ను రద్దు చేశారు.

నిత్యానంద దేశం విడిచి వెళ్లి కైలాసం అనే ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు ప్రకటించుకున్నాడు. ఈ స్థలం ఎక్కడుందనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News