అంతవరకు ప్రజాస్వామ్యం వేచి చూడాల్సిందే!

మలబార్‌ హిల్‌లో సంపన్నులు ఓటేయరని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ గోయెంకా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ వైరల్‌

Advertisement
Update:2024-11-20 13:46 IST

ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంకా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అనేక విషయాలు పంచుకుంటారు. ఆయన పోస్టులు, వీడియోలు స్ఫూర్తిని కలిగించడంతో పాటు అందరినీ ఆలోచింపజేస్తాయి. అయితే మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మలబార్‌ హిల్‌లో సంపన్నులు ఓటేయరని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ గోయెంకా సోషల్‌ మీడియాలో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. అందులో ఆయన మలబార్‌ హిల్‌లో సంపన్నులు పోలింగ్‌ కేంద్రానికి మెర్సిడెస్‌ బెంజ్‌లో వెళ్లాలా? బీఎండబ్ల్యూలో వెళ్లాలా అని చర్చిస్తూ కూర్చుంటారని అన్నారు. మనీస్‌ మల్హోత్రా అవుట్‌ఫిట్‌కు ఏ కళ్లజోడు పెట్టుకుంటే బాగుంటుందోనని తెగ కష్టపడుతుంటారని.. అంతవరకు ప్రజాస్వామ్యం వేచి చూడాల్సిందేనని అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్‌ బూత్‌ వద్ద వాలెట్‌ పార్కింగ్‌ ఉందా? లేదా అని ఆలోచిస్తారన్నారు. వారికి అంతకంటే మరే ఆలోచనలు ఉండవని.. క్యూలో సాధారణ ప్రజలతో కలిసి వెళ్లి ఓటు వేయాల్సి వస్తుందని సంపన్నులు భయపడుతున్నారని గోయెంకా పేర్కొన్నారు.

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ బుధవారం కొనసాగుతున్నది. మహారాష్ట్రలో ఒకే విడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు ఓటింగ్‌ జరగుతున్నది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగిచుకున్నారు.

Tags:    
Advertisement

Similar News