జార్ఖండ్‌లో కమలం పార్టీకి భారీ షాక్
జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి షాక్ తగిలింది. కాషాయ పార్టీకి చెందిన పలువురు నేతలు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలో చేరారు.
జార్ఖండ్‌లో బీజేపీకీ భారీ షాక్ తగిలింది. కమలం పార్టీకి చేందిన పలువురు నేతలు నేతలు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలో చేరారు. దీంట్లో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు లూయిస్ మారండి, కునాల్ సారంగి, లక్ష్మణ్ తండు ఉన్నారు. మూడు సార్లు బీజేపీ టికెట్‌పై గెలిచిన కేదార్ హజ్రా కూడా ఇటీవల జేఎంఎం పార్టీలో చేరారు. బీజేపీ నుంచి 2014లో లూయిస్ మరాండి.. 5వేల ఓట్ల తేడాతో దుమ్కాలో సీఎం హేమంత్ సోరెన్‌పై విజయం సాధించారు.
ఇప్పుడు లూయిస్ మరాండి జేఎంఎంలో చేరారు. మాజీ బీజేపీ నేతలకు వెల్కమ్ చెబుతూ సీఎం హేమంత్ సోరెన్ తన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అయితే దుమ్కా స్థానం నుంచి 2019లో హేమంత్ సోరెన్ 13వేల ఓట్ల తేడాతో లూయిస్ మరాండిపై గెలుపొందారు. అదే స్థానంలో జరిగిన బైపోల్స్‌లో బసంత్ సోరెన్ చేతిలో లూయిస్ ఓడిపోయారు. 81 శాసన సభ స్థానలకు జార్ఖండ్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 13, నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు రానున్నాయి.