భారత్‌కూ విస్తరించిన కోవిడ్ కొత్త వేరియంట్లు
కేపీ–1 కేసులు అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 23 నమోదయ్యాయి. కేపీ–2 కేసులు మాత్రం ఎక్కువగా మహారాష్ట్ర (148)లో వెలుగుచూశాయని అధికారులు తెలిపారు.
కోవిడ్ తాజా వేరియంట్లు ఇప్పుడు సింగపూర్‌ని కుదిపేస్తున్నాయి. జేఎన్–1 సబ్ వేరియంట్లు అయిన కేపీ–1, కేపీ–2 వేరియంట్లు అక్కడ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. మే 5 నుంచి 11 వరకు అంటే వారం రోజుల్లో ఏకంగా 25,900 కేసులు నమోదవడం అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో అక్కడి అధికారులు దీనిని వ్యాప్తిని అడ్డుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఇక కేపీ–1, కేపీ–2 వేరియంట్లు భారత్‌కు కూడా విస్తరించాయని ఇక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లో ఈ కేసులు నమోదవుతున్నాయని తెలిపాయి. కేపీ–1 వేరియంట్ కేసులు ఇప్పటివరకు 34 నమోదు కాగా, కేపీ–2 వేరియంట్ కేసులు ఏకంగా 290 నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
కేపీ–1 కేసులు అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 23 నమోదయ్యాయి. కేపీ–2 కేసులు మాత్రం ఎక్కువగా మహారాష్ట్ర (148)లో వెలుగుచూశాయని అధికారులు తెలిపారు. అయితే ఈ వేరియంట్ల గురించి ప్రజలు భయపడాల్సని అవసరం లేదని, ఇవన్నీ జేఎన్–1 సబ్ వేరియంట్లేనని, వైరస్‌లో మ్యుటేషన్లు సాధారణమేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇండియన్ సార్స్–కోవ్–2 జీనోమిక్స్ కన్సార్షియం సభ్యులు ఎప్పటికప్పుడు ఈ వైరస్ సోకిన వారి నుంచి నమూనాలు సేకరిస్తూ.. దాని ప్రభావాన్ని విశ్లేషిస్తున్నారని తెలిపింది.