భారత ఉపరాష్ట్రపతిగా జ‌గ‌దీప్ ధ‌న్‌కర్ విజయం

భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి జ‌గ‌దీప్ ధ‌న్‌కర్ విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి మార్గరేట్ అల్వా పై ఆయన 364 ఓట్ల తేడాతో గెలుపొందారు.

Advertisement
Update:2022-08-06 20:24 IST

భారత ఉపరాష్ట్రపతిగా జ‌గ‌దీప్ ధ‌న్‌కర్ ఘన విజయం సాధించారు. కొద్ది సేపటి క్రితం ముగిసిన ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపులో, అధికార ఎన్డీఏ కూటమి అభ్య‌ర్థి జ‌గదీప్ విజ‌యం సాధించారు.విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థి మార్గ‌రెట్ అల్వాపై ఆయ‌న 364 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు.

మొత్తం 780 ఎలక్టోర్స్‌లో 725 మంది మాత్రమే ఓటు వేశారు. అందులో ధన్‌కర్‌కు 528 ఓట్లు రాగా విప‌క్షాల అభ్యర్థి మార్గరెట్‌ అల్వాకు 182 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు చెల్లలేదు. లోక్‌ సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌ కుమార్‌ సింగ్ ధన్‌కర్‌ గెలుపును అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 11న జ‌గ‌దీప్ భార‌త ఉప‌రాష్ట్రప‌తిగా పద‌వీ బాధ్య‌త‌లు చేపడతారు.

రాజస్థాన్ కు చెందిన ధన్ కర్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పని చేశారు. ఆయన రాజస్థాన్ నుంచి 1989 లో ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా పని చేశారు. 1993 లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 నుంచి ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా కొనసాగుతున్నారు. 

Tags:    
Advertisement

Similar News