నరోడా మారణహోమం దోషి కుమార్తెకు.. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ టికెట్

గోద్రా ఘటన అనంతరం ఈ నరోడా పాటియా అల్లర్లు జరగడం ప్రపంచవ్యప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో మనోజ్ అనే వ్యక్తి సహా 16 మందిని దోషులుగా తేలుస్తూ కింది కోర్టులు తీర్పు ఇచ్చాయి.

Advertisement
Update:2022-11-12 15:05 IST

బీజేపీ తన వైఖరి మార్చుకోవడం లేదు. దోషులకు దండలు వేసిన వారికే కాదు.. వారి కుటుంబ సభ్యులకు కూడా టికెట్లు ఇస్తున్నది. బిల్కిస్ బానో రేపిస్టులను పొగిడిన వ్యక్తికి టికెట్ ఇచ్చిన బీజేపీ.. తాజాగా నరోడా మారణహోమం దోషి కుమార్తెకు టికెట్ కేటాయించింది. గుజరాత్ సీఎంగా మోడీ పని చేస్తున్న సమయంలో గోద్రా అల్లర్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ అల్లర్ల తర్వాత నరోడా పాటియా మారణహోమం జరిగింది. 2002లో ఒక వర్గానికి చెందిన 97 మంది ఈ మారణహోమంలో ప్రాణాలు కోల్పోయారు.

గోద్రా ఘటన అనంతరం ఈ నరోడా పాటియా అల్లర్లు జరగడం ప్రపంచవ్యప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో మనోజ్ అనే వ్యక్తి సహా 16 మందిని దోషులుగా తేలుస్తూ కింది కోర్టులు తీర్పు ఇచ్చాయి. హైకోర్టు కూడా వీరికి పడిన జీవిత ఖైదును సమర్థించింది. ఇప్పుడు ఆ దోషి మనోజ్ కుకరాణి కుమార్తె పాయల్‌కు బీజేపీ నరోడా అసెంబ్లీ స్థానం టికెట్ కేటాయించింది. తండ్రి ఏ ఊరిలో అయితే మారణహోమం సృష్టించాడో అక్కడే కుమార్తెకు టికెట్ కేటాయించడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.

నరోడా సిట్టింగ్ ఎమ్మెల్యే బలరామ్ తవానీని పక్కన పెట్టి మరీ పాయల్‌కు ఈ టికెట్ ఇవ్వడం గమనార్హం. 1990 నుంచి ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీనే గెలుస్తూ వస్తోంది. నరోడా ప్రాంతంలో సింధి కమ్యూనిటీ బలమైన వర్గంగా ఉండటంతో పాయల్‌కు టికెట్ కేటాయించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం 30 ఏళ్ల పాయల్ ఓ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తోంది. గుజరాత్ ఎన్నికల్లో టికెట్ దక్కించకున్న పిన్న వయస్కురాలిగా పాయల్ రికార్డు సృష్టించింది. పాయల్ తల్లి రేష్మ ప్రస్తుతం కార్పొరేటర్‌గా పని చేస్తున్నారు. తండ్రి మనోజ్ పెరోల్‌పై బయట ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News