Taraka Ratna Dead: నందమూరి తారకరత్న కన్నుమూత‌

Nandamuri Taraka Ratna Death: నారాయణ హృదయాలయ వైద్యులతో పాటు విదేశాల నుంచి వచ్చిన వైద్యులు కూడా తారక రత్నను బతికించడానికి తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ అందులో వారు విజయం సాధించలేకపోయారు. 39 ఏళ్ళ తారక రత్న మృతి వల్ల‌ నందమూరి అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Advertisement
Update:2023-02-18 22:07 IST

Taraka Ratna Dead: నందమూరి తారకరత్న కన్నుమూత‌

23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తెలుగు సినిమా నటుడు నందమూరి తారకరత్న‌ కొద్ది సేపటిక్రితం కన్నుమూశారు. ఈ నెల 27న కుప్పంలో టీడీపీ నాయకుడు నారా లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న ఆయన‌ హటాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయనకు మొదట కుప్పం ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి, ఆ తర్వాత బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.

ఆయనకు గుండెలో ఎడమవైపు 90శాతం బ్లాక్‌ అయింది. బ్రెయిన్ కు ఆక్సీజన్ అందక పోవడం వల్ల సమస్యలొచ్చాయి. మొదటి రోజు నుంచి తారక రత్న కోమాలోనే ఉన్నారు. నారాయణ హృదయాలయ వైద్యులతో పాటు విదేశాల నుంచి వచ్చిన వైద్యులు కూడా తారక రత్నను బతికించడానికి తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ అందులో వారు విజయం సాధించలేకపోయారు. 39 ఏళ్ళ తారక రత్న మృతి వల్ల‌ నందమూరి అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భార్య అలేఖ్య, కూతురు నిషిక ఆస్పత్రిలోనే ఉన్నారని సమాచారం.

కాగా, 1983 జనవరి 8 తారక రత్న‌ జన్మించారు. నందమూరి తారకరామారావుకు మనవడైన తారకరత్న 22 మూవీల్లో నటించారు. ఒకటో నెంబర్ కుర్రోడు అతనిమొదటి మూవీ. 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ లో కూడా అయన నటించారు. అమరావతి మూవీలో అతను పోషించిన ప్రతినాయకుడు పాత్రకు నంది అవార్డు వచ్చింది. ఆయన‌ 2001లో ఒకేసారి 9 సినిమాలు మొదలు పెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించారు.

Tags:    
Advertisement

Similar News