మోడీ డిగ్రీ వ్యవహారం :ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రకారం చదువులన్నీ వేస్టేనా ?
''ఐఐటీలలో చదివినా సరే కొంతమంది నిరక్షరాస్యులుగానే మిగిలిపోతారనేందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. డిగ్రీ అనేది విద్యకు ఓ రసీదు మాత్రమే..కానీ విద్య అనేది ఆయా మనుషులకు ఉండే జ్ఞానంలోను ప్రవర్తనలోనుఉంటుంది. కేజ్రీవాల్ వ్యాఖ్యలు ఐఐటీల్లో చదువుకుని నిరక్ష్యరాస్యులుగా వ్యవహరించేవారిలానే ఉన్నాయి.'' అంటూ గవర్నర్ సక్సేనా విమర్శలు గుప్పించారు.
ఐఐటీల్లో చదివామని గర్వపడనక్కర్లేదని సర్టిఫికెట్లు కేవలం రసీదులు మాత్రమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా. ఈ వ్యాఖ్యలు ఆయన మోడీ డిగ్రీ వివాదం నేపథ్యంలో కేజ్రీవాల్ ను దృష్టిలో పెట్టుకొని చేశాడన్నది తెలుస్తూనే ఉంది. పైగా ఐఐటీలలో చదివినా సరే కొంతమంది నిరక్షరాస్యుల్లానే ప్రవర్తిస్తారని ఆయన విరుచుకపడ్డారు.
''ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల గురించి నేను విన్నాను. ఎవరైనా సరే తమ సర్టిఫికెట్లను చూసుకొని మరీ ఎక్కువగా గర్వపడకూడదు.కొన్ని రోజులుగా విద్యార్హతలకు సంబంధించి జరుగుతున్న చర్చను చూస్తున్నాను.ఐఐటీలలో చదివినా సరే కొంతమంది నిరక్షరాస్యులుగానే మిగిలిపోతారనేందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. డిగ్రీ అనేది విద్యకు ఓ రసీదు మాత్రమే..కానీ విద్య అనేది ఆయా మనుషులకు ఉండే జ్ఞానంలోను ప్రవర్తనలోనుఉంటుంది. కేజ్రీవాల్ వ్యాఖ్యలు ఐఐటీల్లో చదువుకుని నిరక్ష్యరాస్యులుగా వ్యవహరించేవారిలానే ఉన్నాయి.'' అంటూ గవర్నర్ సక్సేనా విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోడీ విద్యార్హతలపై కేజ్రీవాల్ కొంత కాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మోడీ విద్యార్హతలేంటో తేల్చాలని, ఆయన సర్టిఫికెట్లను బహిరంగ పర్చాలని డిమాండ్ చేస్తూ కేజ్రీవాల్ కోర్టుకు కూడా వెళ్ళారు. అయితే కోర్టులో ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. అయినా కూడా ఆయనా, ఆయన పార్టీనేతలు మోడీ విద్యార్హతలపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.
కాగా గవర్నర్ కేజ్రీవాల్ పై చేసిన వ్యాఖ్యలను ఢిల్లీ విద్యాశాఖా మంత్రి 'అతీశీ' తీవ్రంగా ఖండించారు. ఐఐటీ చదువులను అవమానించేలా సక్సేనా మాట్లాడారని , ఆయా సంస్థల్లో చదివిన వారు దేశ, విదేశాల్లో ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్నారని ఆమె అన్నారు. తమ విద్యార్హతల సర్టిఫికెట్లు దాచే వారే చదువుకున్న వారిపై విమర్శలు చేస్తారని ఆమె మండిపడ్డారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా కూడా తన విధ్యార్హతల సర్టిఫికెట్లు ప్రజలకు చూపించాలని ఆమె డిమాండ్ చేశారు.