రూ.800 పెంచి రూ.200 తగ్గిస్తారా..? ఇదెక్కడి న్యాయం

ఇదెక్కడి ఘోరం అంటూ మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. 800 రూపాయలు పెంచిన కేంద్రం 200 రూపాయలు తగ్గించి పండగ చేస్కోమంటుందా అని నిలదీశారు.

Advertisement
Update:2023-08-29 21:46 IST

ఎన్నికల వేళ తాయిలాలు ప్రకటించడానికి మోదీ ఏమాత్రం మొహమాట పడరనే విషయం అందరికీ తెలుసు. అనుకున్నట్టుగానే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ గ్యాస్ సిలిండర్ పై 200 రూపాయల తగ్గింపు ప్రకటించింది కేంద్రం. ఒకేసారి 200 రూపాయలు తగ్గింపు అంటే మాటలు కాదు. పోనీ ఆ స్థాయిలో అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గాయా అంటే అదీ లేదు. కారణం అందరికీ తెలిసిందే. ఎన్నికల వేళ తన దోపిడీని కాస్త తగ్గించింది కేంద్రం. ఇన్నాళ్లూ అడ్డగోలుగా గ్యాస్ సిలిండర్లపై వసూలు చేసిన దాంట్లో కేవలం 200 రూపాయలు మాత్రమే తగ్గించింది. ఇదెక్కడి ఘోరం అంటూ మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. 800 రూపాయలు పెంచిన కేంద్రం 200 రూపాయలు తగ్గించి పండగ చేస్కోమంటుందా అని నిలదీశారు.

గ్యాస్ సిలిండర్ రేటు తగ్గింపు అనేది ప్రజలకు కేంద్రం ఇచ్చే కానుక కాదని.. సామాన్యుల జేబులకు చిల్లులు పెట్టడమేనని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. ఎన్నికల వేళ ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.



2014లో గ్యాస్ సిలిండర్ రేటు రూ. 400

మోదీ హయాంలో ప్రస్తుతం రేటు రూ.1200

అంటే వివిధ కారణాలతో మోదీ ప్రభుత్వం సిలిండర్ రేటుని 800 రూపాయలు పెంచింది. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో 200 రూపాయలు తగ్గించింది. పోనీ ఈ 9 ఏళ్లలో సహజంగా రేటు 100 రూపాయలు పెరిగినా ఇంకా 500 రూపాయలు దోపిడీ జరుగుతుందనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి 200 రూపాయలు తగ్గించామంటూ బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకోవడం ప్రజలను మభ్యపెట్టడమేనంటున్నారు కవిత. 


Tags:    
Advertisement

Similar News