కోటి రూపాయల కరెంట్ కొట్టేశాడు.. చివరికిలా దొరికిపోయాడు

మీటర్ ట్యాంపరింగ్ చేసి 3,37,215 యూనిట్ల కరెంటు దొంగతనంగా వాడాడని నిర్థారించారు అధికారులు. 1,27,50,000 రూపాయలు జరిమానా విధించారు. దీనికితోడు 6,60,000 రూపాయలు అపరాధ రుసుముగా చెల్లించాలన్నారు.

Advertisement
Update:2023-02-20 15:49 IST

పల్లెటూళ్లలో కరెంటు స్తంభాలకు కర్రలు తగిలించి దొంగతనంగా కరెంటు వాడుకోవడం చూస్తునే ఉంటాం. నెలకు 500, వెయ్యి రూపాయల బిల్లులు కట్టకుండా కొంతమంది అలా దొంగతనం చేస్తూ ఉంటారు. కానీ పుణెలోని ఓ వ్యక్తి ఏకంగా కోటీ 27 లక్షల రూపాయల విలువ చేసే కరెంటు దొంగతనం చేశాడు. చివరకు అధికారుల తనిఖీల్లో అతను పట్టుబడ్డాడు. అతనికి జరిమానా విధించింది విద్యుత్ శాఖ.

పుణెలోని కోరెగావ్ పార్క్ లో కమర్షియల్ కరెంటు కనెక్షన్ ఉన్న ఓ వ్యక్తి చిన్న కంపెనీ నడుపుతుండేవాడు. ప్రతి నెలా అతనికి బిల్లు మాత్రం వేలల్లోనే వచ్చేది. అధికారులు కూడా చూసీ చూడనట్టు వెళ్లేవారు. కానీ ఇటీవల ఉన్నతాధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 20కెవి కంటే ఎక్కువ లోడ్ వాడే వారిపై నిఘా పెట్టాలన్నారు. అలా తనిఖీలు చేపట్టడంతో మనోడి బండారం బయటపడింది.

ట్యాంపరింగ్..

కరెంట్ మీటర్ ని ట్యాంపపర్ చేయడం ద్వారా సదరు వ్యక్తి బిల్లు తక్కువగా వచ్చేలా చేసేవాడు. 100 రూపాయల బిల్లు అయితే అందులో కేవలం 21 రూపాయలు మాత్రమే బిల్లు కట్టేవాడు. ఈ ట్యాంపరింగ్ మోసాన్ని చాన్నాళ్లుగా చేస్తున్నాడు. అలా మీటర్ ట్యాంపరింగ్ చేసి 3,37,215 యూనిట్ల కరెంటు దొంగతనంగా వాడాడని నిర్థారించారు అధికారులు. 1,27,50,000 రూపాయలు జరిమానా విధించారు. దీనికితోడు 6,60,000 రూపాయలు అపరాధ రుసుముగా చెల్లించాలన్నారు.

Tags:    
Advertisement

Similar News