'ఉబర్' లీలలు... దుమ్మెత్తిపోస్తున్న వినియోగదారులు

ఉబర్ క్యాబ్ లో ఎక్కిన ఓ వ్యక్తికి 45 కిలోమీటర్ల ప్రయాణానికి 3 వేల రూపాయలు వసూలు చేశారు. దీనిపై అసంతృప్తి చెందిన ఆ వినియోగదారుడు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ వైరల్ అవడమే కాక అనేక మంది నెటిజనులు ఉబర్ తో తమ అనుభవాలను పంచుకుంటు ఆ సంస్థపై దుమ్మెత్తి పోస్తున్నారు.

Advertisement
Update:2022-08-18 09:31 IST

ఉబర్, ఓలా క్యాబ్ ల లీలలు ఓ రకంగా ఉండవు. ఒకే దూరానికి ఒక సారి ఓ రేట్ వసూలు చేస్తే మరో సారి మరో రేట్ వసూలు చేస్తారు. ఒక్కో సారి బిజీ టైంలో మూడు నాలుగు రెట్లు ఎక్కువ వసూలు చేస్తూ ఉంటారు. నొయిడాలో ఓ వ్యక్తికి మరో అనుభవం ఎదురయ్యింది. 45 కిలో మీటర్ల ప్రయాణానికి 3వేల రూపాయల బిల్లు వసూలు చేసింది ఊబర్.

ఉత్తరప్రదేశ్‌ కు చెందిన దేబర్షి దాస్‌గుప్తా.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి నోయిడాలో ఉన్న తన ఇంటికి వెళ్లేందుకు ఉబెర్‌ను ఆశ్రయించాడు. మొత్తం 45 కిలోమీటర్ల ప్రయాణం. అయితే ఇంటి దగ్గర దిగగానే ఆయనకు షాక్ తగిలింది. గుప్తా 145 కిలో మీటర్లు ప్రయాణించినట్టు, 2,935 రూపాయలు చెల్లించాలంటూ మెసేజ్ వచ్చింది. ఏం చేయాలో అర్దం కాని గుప్తా తప్పనిసరి పరిస్థితుల్లో 2,935 రూపాయలను చెల్లించారు. ఆ పై తన అనుభవాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

''ఇలా ఉబర్ చేసిన పని గురించి పబ్లిక్ గా రాయడం సరైంది కాకపోవచ్చు కాని నాకు మరో మార్గం లేదు.

ఆగస్టు 5న ఢిల్లీ విమానాశ్రయం నుండి నోయిడాలోని నా ఇంటికి (సుమారు 45 కి.మీ.లు) క్యాబ్‌కి 2,935 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. నాకు 147.39 కి.మీ.లకు బిల్ చేయబడింది." అని ఆ వ్యక్తి తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

"నేను బుకింగ్ చేసినప్పుడు 1,143 రూపాయలు చూపించింది. పికప్ మరియు డ్రాప్ లొకేషన్‌లు కూడా సరిగ్గా లేవు! దయచేసి ఈ గందరగోళాన్ని సరిచేయండి. నేను చెల్లించిన‌ అదనపు మొత్తాన్ని వాపసు చేయండి. మీకు, నా వివరాలను పంపమని మాత్రం అడగవద్దు. మీ వద్ద ఇప్పటికే నా వివరాలుఉన్నాయి! మీరు @Uber_Support అనే మీ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని సరిదిద్దాలి," అని ఆయన అన్నారు.

గుప్తా చేసిన్ ఈ ట్వీట్ వైరల్ కావడంతో చాలా మంది నెటిజనులు ఉబర్, ఓలాలతో తమకు జరిగిన అనుభవాలను పంచుకున్నారు. ఆ సంస్థలపై దుమ్మెత్తి పోశారు.

" నాకు కూడా ఇలాంటి అనుభ‌వమే ఎదురయ్యింది. ఎయిర్ పోర్ట్ నుండి నోయిడాకు ఒకసారి నేను ఉబర్ బుక్ చేసినప్పుడు 1.500 రూపాయలు చూపించారు. ఆ తర్వాత‌ 3, 500 రూపాయలు ఛార్జ్ చేసారు. నేను వాపసు డిమాండ్ చేసాను. వారు రీఫండ్ చేయాల్సి వచ్చింది" అని ఒక వినియోగదారు రాశారు. .

"నాకు ఇలాంటి సమస్యే ఉంది. వాళ్ళకు పిర్యాదు చేశాను కానీ 3-4 రోజులుగా స్పందన లేదు.'' అని మరో వినియోగదారుడు వాపోయాడు.

Tags:    
Advertisement

Similar News