భ‌ర్త సంపాద‌న‌లోనే కాదు.. ఆస్తిలోనూ భార్య‌కు స‌మాన హ‌క్కు.. - మ‌ద్రాసు హైకోర్టు

విదేశాలలో తాను కష్టపడి సంపాదించి పంపించిన డబ్బులతో కొనుగోలు చేసిన ఆస్తులన్నీ తన భార్య పేరిట ఉన్నాయ‌ని, వాటిని త‌న పేరిట మార్చాల‌ని కోరుతూ పిటీష‌న్‌దారు మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు.

Advertisement
Update:2023-06-25 11:25 IST

భర్త సంపాదనలోనే కాదు.. కూడబెట్టిన ఆస్తిలో కూడా భార్యకు సమాన హక్కు ఉంటుందని మద్రాసు హైకోర్టు తేల్చి చెప్పింది. ఓ కేసు విష‌య‌మై శ‌నివారం ఇచ్చిన ఆదేశాల్లో ఈ విష‌యం స్ప‌ష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణన్ రామస్వామి ఆదేశాలు జారీ చేశారు. ఓ భ‌ర్త వేసిన పిటిష‌న్‌ను ప‌రిశీలించిన న్యాయ‌మూర్తి ఈ ఆదేశాలు ఇచ్చారు.

విదేశాలలో తాను కష్టపడి సంపాదించి పంపించిన డబ్బులతో కొనుగోలు చేసిన ఆస్తులన్నీ తన భార్య పేరిట ఉన్నాయ‌ని, వాటిని త‌న పేరిట మార్చాల‌ని కోరుతూ పిటీష‌న్‌దారు మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను విచారించిన‌ న్యాయమూర్తి కృష్ణన్ రామస్వామి బెంచ్ వాదోప‌వాదాల అనంత‌రం స్పందిస్తూ.. గృహిణులు రోజుకు 24 గంటలూ శ్రమిస్తుంటారని, వారి సేవను వెలకట్టలేమని చెప్పారు. భర్త పనిచేసే 8 గంటలతో దీన్ని పోల్చలేమ‌ని స్ప‌ష్టం చేశారు. భర్త సంపాదనతో పాటు కూడబెట్టిన ఆస్తిలో కూడా భార్యకు సమాన హక్కు ఉం టుందని ఈ సంద‌ర్భంగా స్పష్టం చేశారు. అందువల్ల ఈ పిటీషన్‌ను తిరస్కరిస్తున్నట్టు న్యాయ‌మూర్తి తెలిపారు.

Tags:    
Advertisement

Similar News