చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కేజ్రీవాల్ ను బెదిరించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్
"నాకు వ్యతిరేకంగా ప్రభుత్వం, మీరు, మీ సహచరులు చేసిన నిరాధారమైన, తప్పుడు ప్రకటనలకు సంబంధించి జవాబును కోరుతున్నాను" అని సక్సేనా , కేజ్రీవాల్‌కు లేఖలో రాశారు. మీ ఆరోపణలకు సాక్ష్యాలు చూపించడంలో మీరు విఫలమైతే ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని సక్సేనా హెచ్చరించారు.
ఢిల్లీ ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న విద్యుత్ సబ్సిడీని ఆపేందుకు తాను ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించినందుకు గాను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తీవ్ర పదజాలంతో కూడిన లేఖ రాశారు.
పేదలకు విద్యుత్ సబ్సిడీని అందించేందుకు అవసరమైన ఫైల్‌లను క్లియర్ చేయకుండా లెఫ్టినెంట్ గవర్నర్ ఆపుతున్నారని ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి అతిషి, ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ లు కొద్ది రోజులుగా ఆరొపిస్తున్న నేపథ్యంలో సక్సేనా ఈ లేఖ రాశారు.
''ఇవి తప్పుడు ఆరోపణలు. ప్రజలను తప్పుదోవ పట్టించేవి. పరువునష్టం కలిగించేవి'' అని సక్సేనా తన లేఖలో ఆరోపించారు. విద్యుత్ సబ్సిడీని ఆపడానికి తాను ప్రయత్నించినట్లు రుజువు చేయాలని AAP ప్రభుత్వానికి సక్సేనా సవాల్ విసిరారు.
"నాకు వ్యతిరేకంగా ప్రభుత్వం, మీరు, మీ సహచరులు చేసిన నిరాధారమైన, తప్పుడు ప్రకటనలకు సంబంధించి జవాబును కోరుతున్నాను" అని సక్సేనా , కేజ్రీవాల్‌కు లేఖలో రాశారు.
మీ ఆరోపణలకు సాక్ష్యాలు చూపించడంలో మీరు విఫలమైతే ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని సక్సేనా హెచ్చరించారు.
కాగా, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు తమను వేధించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ఆప్ నేతలు తరచూ విరుచుకుపడుతున్నారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడుతో సహా ఇతర బిజెపియేతర రాష్ట్రాలు కూడా గవర్నర్లపై ఇలాంటి ఆరోపణలే చేస్తున్నాయి.