అమ్మకానికి ఎడమ కిడ్నీ.. ఎందుకో తెలిస్తే షాక్..!

అద్దె ఇళ్లకోసం బెంగళూరులో ఎలాంటి కష్టాలు పడాలో ఈ పోస్టర్ ద్వారా తెలిసిపోతోంది. సెక్యూరిటీ డిపాజిట్ కోసం కిడ్నీ అమ్ముతానని పోస్టర్లు వేసిన అతడు.. ఆ తర్వాత అసలు విషయం చిన్న అక్షరాల్లో వివరించాడు.

Advertisement
Update:2023-02-27 23:04 IST

“అద్దె ఇంటికోసం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించేందుకు డబ్బులు కావలెను. నా ఎడమ కిడ్నీ అమ్మకానికి కలదు.” ఇదీ ఓ వ్యక్తి కరెంట్ పోల్ కి అంటించిన పోస్టర్ సారాంశం. ఈ పోస్టర్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెంగళూరులో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. అవును, బెంగళూరు లాంటి మహానగరంలో ఇల్లు అద్దెకు దొరకాలంటే రెంటుకంటే ముందు సెక్యూరిటీ డిపాజిట్ కి తల తాకట్టు పెట్టాల్సిందే. ఏడాది అద్దె ముందుగానే సెక్యూరిటీ డిపాజిట్ గా చెల్లిస్తేనే అద్దెకు ఇల్లు దొరుకుతుంది. రెంటు కట్టే స్థోమత ఉన్నా కూడా సెక్యూరిటీ డిపాజిట్ కు డబ్బులు లేక చాలామంది అవస్థలు పడుతుంటారు. అలాంటి వారిలో ఈ పోస్టర్ వేసిన రమ్యక్ జైన్ కూడా ఒకరు.

సెక్యూరిటీ డిపాజిట్ కోసం కిడ్నీ అమ్ముతానని పోస్టర్లు వేసిన అతడు.. ఆ తర్వాత అసలు విషయం చిన్న అక్షరాల్లో వివరించాడు. ఇది కేవలం జోక్ అని, తనకు బెంగళూరులోని ఇందిరానగర్ లో ఇల్లు అద్దెకు కావాలని వివరించాడు. వివరాలకు ఈ కింది క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అంటూ దిగువన క్యూఆర్ కోడ్ కూడా ఉంచాడు. అందులో తన వివరాలు పొందుపరిచాడు. ఈ వెరైటీ పోస్టర్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.


అద్దె ఇళ్లకోసం బెంగళూరులో ఎలాంటి కష్టాలు పడాలో ఈ పోస్టర్ ద్వారా తెలిసిపోతోంది. ఇందిరానగర్ లోనే అక్కడక్కడ ఈ పోస్టర్లు అంటించాడు రమ్యక్ జైన్. లెఫ్ట కిడ్నీ ఫర్ సేల్ అంటూ సడన్ గా పోస్టర్ కనపడే సరికి అందరూ అలర్ట్ అయిపోయి దాన్ని చదువుతున్నారు, కింద మేటర్ కూడా చదివి తర్వాత నవ్వుకుంటూ వెళ్లిపోతున్నారు. ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారడంతో రమ్యక్ జైన్ హ్యూమర్ ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈపాటికే అతడికి అద్దెకు ఇల్లు దొరికి ఉంటుందని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News