ఆ రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇక ‘వాటర్‌ బెల్‌’..

2019లో దేశంలో మొదటిసారి ఈ విధానాన్ని కేరళలోని కొన్ని పాఠశాలల్లో ప్రారంభించామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రిత్వ కార్యాలయం తెలిపింది. అనంతరం ఈ విధానాన్ని కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు సైతం అమలుచేశాయని పేర్కొంది.

Advertisement
Update:2024-02-18 10:03 IST

రానున్న వేసవిలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం కేరళ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో విద్యార్థులకు లంచ్‌ బ్రేక్‌ ఇచ్చినట్లుగా వాటర్‌ బ్రేక్‌ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. వేసవిలో విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురవకుండా ఉండడానికి, తగినంత నీరు తాగేలా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాలల్లో ‘వాటర్‌–బెల్‌‘ విధానాన్ని అమలుచేయాలని యోచిస్తోంది.

ఈనెల 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రిత్వ కార్యాలయం తెలిపింది. ఇందులోభాగంగా పాఠశాలల్లో ఉదయం 10.30, మధ్యాహ్నం 2.30 గంటలకు ఐదు నిమిషాల పాటు విద్యార్థులకు నీరు తాగడానికి విరామం ఇవ్వనున్నారని తెలిపింది. ఇది పిల్లల్లో డీహైడ్రేషన్, ఇతర అనారోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతుందని వివరించింది.

2019లో దేశంలో మొదటిసారి ఈ విధానాన్ని కేరళలోని కొన్ని పాఠశాలల్లో ప్రారంభించామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రిత్వ కార్యాలయం తెలిపింది. అనంతరం ఈ విధానాన్ని కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు సైతం అమలుచేశాయని పేర్కొంది. దీనిని పరిగణనలోకి తీసుకొని ప్రస్తుత వేసవికి దీనిని అమలులోకి తెస్తున్నట్టు తెలిపింది.

ఇదిలావుండగా, కేరళ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిర్వహణ అథారిటీ (కేఎస్‌ఓఎంఏ) కన్నూరు, కొట్టాయం, కొయ్కిడ్, అలప్పుళ జిల్లాల్లో సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతలను సూచిస్తూ హెచ్చరిక జారీ చేసింది. వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు సూచించింది.

Tags:    
Advertisement

Similar News