అదానీ స్కాంపై జాయింట్ పార్లమెంటు కమిటీ వేయాలి -కేసీఆర్ డిమాండ్
మహారాష్ట్ర, నాందేడ్ లో బీఆరెస్ బహిరంగ సభ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసిఆర్ మాట్లాడుతూ, అదానీ స్కాంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వారంరోజుల్లో అదానీ సంపద 10 లక్షల కోట్లు ఆవిరయిపోయిందని, ఇంత జరుగుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడమేంటనీ కేసీఆర్ ప్రశ్నించారు.
మోడీ స్నేహితుడు అదానీ దశాబ్దాలుగా చేసిన స్కాం బైట పడ్డ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం ఏంటని బీఆరెస్ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు.
మహారాష్ట్ర, నాందేడ్ లో బీఆరెస్ బహిరంగ సభ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసిఆర్ మాట్లాడుతూ, అదానీ స్కాంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వారంరోజుల్లో అదానీ సంపద 10 లక్షల కోట్లు ఆవిరయిపోయిందని, ఇంత జరుగుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడమేంటనీ కేసీఆర్ ప్రశ్నించారు.
పారిశ్రామికవేత్త అదానీపై ఉన్న ప్రేమ మోడీకి దేశ ప్రజలపై లేదని కేసీఆర్ అన్నారు. కిలో బొగ్గును కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అదానీ కోసం బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.
ఎల్ ఐసీ, ఎస్ బీఐ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వేల కోట్ల రూపాయలపెట్టుబడులు అదానీ కంపెనీల్లో ఉన్నాయని, అటువంటి సంస్థలను కాపాడవల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని కేసీఆర్ ప్రశ్నించారు. పార్లమెంటులో విపక్షాలు అదానీ స్కాంపై చర్చ కావాలని అడుగుతున్నా కేంద్రం నిరాకరిస్తున్నదని ఆరోపించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ కావాలని అన్ని పక్షాలు డిమాండ్ చెస్తున్నప్పటికీ ఎందుకు ప్రభుత్వం నిరాకరిస్తున్నదని కేసీఆర్ ప్రశ్నించారు. అదానీ మోడీకి స్నేహితుడన్న విషయం ప్రపంచానికి తెలుసునని, కాబట్టి అదానీ స్కాం పై విచారణ జరిపించి మోడీ నిజాయితీ నిరూపించుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
అదానీ స్కాం విషయం పెద్దగా ఆందోళన చెందాల్సిన అంశం కాదని నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ మాట్లాడుతూ, 4వేల రూపాయలు పెట్టి అదానీ షేర్ ను కొన్న సామాన్యుడు ఇప్పుడు దాన్ని అమ్ముదామంటే వేయిరూపాయలు కూడా రాకపోతే అది ఆందోళన కలిగించే అంశం కాదా ? అని ప్రశ్నించారు. లక్షల మంది మదుపుదారులు వేల కోట్ల రూపాయలు నష్టపోయారని ఆయన అన్నారు. నిర్మలా సీతారామన్ లాంటి మేదావులు ఇలా మాట్లాడితే ఎవరు మాత్రం ఏం చేయగలరు అని కేసీఆర్ అన్నారు.
మహారాష్ట్రలో విదర్భ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ పై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందించిన కేసీఆర్. దేశంలో రాష్ట్రాల ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదని, ఒక వైపు 26 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం ఉందని , మరో వైపు 6 లక్షల జనాభా ఉన్న రాష్ట్రం ఉందని, ఇది సరైన పద్దతి కాదని కేసీఆర్ అన్నారు. విదర్భతో సహా అన్ని రాష్ట్రాల డిమాండ్లపై చర్చజరగాలని ఆయన అన్నారు.