ఈడీ ముందు హాజరైన ఎమ్మెల్సీ కవిత‌

తాను ఏ తప్పూ చేయలేదని, తెలంగాణలో బీజేపీ బ్యాక్‌డోర్‌ ఎంట్రీ పొందలేకపోయినందున బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఈడీని ఉపయోగించుకుంటోందని కవిత ఆరోపించింది.

Advertisement
Update:2023-03-20 11:33 IST

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట రెండో రౌండ్ విచారణకు ఈ రోజు హాజరయ్యారు.

ఈ కేసులో కవితను ఈడీ మార్చి 11న తొలిసారిగా ప్రశ్నించగా, ఆమెకు మార్చి 16న మరోసారి విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ సమన్లు ఇచ్చింది.

అయితే, ఈ కేసులో ఈడీ చర్యకు వ్యతిరేకంగా ఉపశమనం కోసం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న తన పిటిషన్ ను పేర్కొంటూ కవిత 16న విచారణకు వెళ్ళలేదు.

అయితే ఈడీ ఆమె వాదనలను తిరస్కరించింది. మార్చి 20న విచారణకు హాజరుకావాల్సిందిగా ఆమెను కోరింది. దాంతో కవిత ఈ రోజు విచారణకు హాజరయ్యారు.

కాగా, తాను ఏ తప్పూ చేయలేదని, తెలంగాణలో బీజేపీ బ్యాక్‌డోర్‌ ఎంట్రీ పొందలేకపోయినందున బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఈడీని ఉపయోగించుకుంటోందని కవిత ఆరోపించింది. విపక్షాలపై రాజకీయ కక్ష సాధించేందుకే కేంద్ర బీజేపీ సర్కార్ ఈడీ, సీబీఐ, ఐటీలను ఉపయోగిస్తోందని బీఆరెస్ నాయకులు మండిపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News