వాహ్వా...! బీజేపీనేతలు మహిళకిచ్చే గౌరవం ఎంత గొప్పదో !

స్త్రీలను దేవతలుగా పూజిస్తామని చెప్పే బీజేపీ నేతలు ఆ దేవతలకు ఇచ్చే గౌరవం ఏపాటిదో తెలియజేసే ఘటన కర్నాటకలో జరిగింది. కర్నాటక మంత్రి సోమన్న ఓ మహిళను చెంపమీద కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement
Update:2022-10-23 20:05 IST

త‌న‌కు న్యాయం చేయాలంటూ కాళ్ళ మీద ప‌డిన ఓ మ‌హిళ‌ను చెంప‌దెబ్బ కొట్టిన బిజెపి మంత్రి ఉదంతం క‌ర్ణాట‌క‌లో వెలుగులోకి వ‌చ్చింది. అంద‌రికీ ఇళ్ళ ప‌ట్టాలు వ‌చ్చాయి త‌న‌కు రాలేద‌ని , న్యాయం చేయాలంటూ ఓ మ‌హిళ మంత్రి సోమ‌న్న‌కి త‌న గోడు వెళ్ళ‌బోసుకుంది. దాంతో ఆయ‌న ఆగ్ర‌హించి ఆమెను చెంప పై కొట్టాడు. అయిన‌ప్ప‌టికీ ఆమె విల‌పిస్తూ మంత్ర కాళ్ళ‌పై ప‌డింది.

త‌న‌ను తాకుతావా అంటూ ఆగ్ర‌హించారు మంత్రి. ఆయన‌ ఆ మ‌హిళ చెంప‌మీద కొట్టడం కెమెరాకు చిక్కింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. శనివారం కర్నాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి, బీజేపీకి చెందిన వి సోమన్న భూమి పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సంఘ‌ట‌న రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపింది. ఆ మ‌హిళ‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని మ‌హిళా సంఘాలు, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశాయి. మంత్రి ఆల‌శ్యంగా ఈ కార్య‌క్ర‌మానికి రావడంతో అస‌హ‌నానికి గుర‌య్యార‌ని చెబ‌తున్నారు. కాగా ఈ సంఘ‌ట‌న త‌ర్వాత మంత్రి సోమ‌న్న చెంప‌దెబ్బ కొట్టిన మ‌హిళ‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పార‌ని పార్టీ శ్రేణులు తెలిపారు.

బీజేపీ నేత‌లు ఇలా మ‌హిళ‌ల‌పై దాడులు చేయ‌డం ఇదే మొద‌టిసారి కాదు. మంత్రులు బహిరంగంగా ప్రజలను దుర్భాషలాడడం కూడా ప‌రిపాటిగా మారింది. గతేడాది డిసెంబరులో న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి మహిళా రైతుపై అసభ్యంగా ప్రవర్తించారు. సెప్టెంబర్ 3 న, తన ఇంటిని కూల్చివేయడాన్ని నిరసించిన‌ ఒక మహిళను బిజెపి కర్ణాటక ఎమ్మెల్యే అరవింద్ లింబావలి బెదిరించి, దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదాస్పదమైంది.


Tags:    
Advertisement

Similar News