కర్నాటక ఎన్నికల్లో 20 స్థానాల్లో ఎమ్ ఐ ఎమ్ పోటీ.... కాంగ్రెస్ లో ఆందోళన‌

కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అవకాశం ఉన్న స్థానాల్లోనే AIMIM పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్ నాయకత్వం ఆందోళన చెందుతోంది. బీజేపీవ్యతిరేక ఓట్లను చీల్చి ఆ పార్టీని గెలిపించడం కోసమే MIM రంగంలోకి దిగిందని కర్నాటక కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

Advertisement
Update:2023-03-06 10:37 IST

Karnataka Assembly polls: AIMIM releases first list of candidatesత్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 20స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు AIMIM ప్రకటించింది. అందులో భాగంగా ఆ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. బెలగావి నార్త్‌కు లతీఫ్‌ఖాన్ అమీర్‌ఖాన్ పఠాన్, హుబ్లీ-ధార్వాడ్ ఈస్ట్‌కు దుర్గప్ప కాశప్ప బిజావాడ్, బసవన బాగేవాడి అసెంబ్లీ నియోజకవర్గానికి అల్లాబక్ష్ మెహబూబ్ సాబ్ లను అభ్యర్థులుగా పార్టీ ప్రకటించింది.

కొద్ది రోజుల క్రితం, AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ 65వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా కర్ణాటక ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

ఈ ముగ్గురు అభ్యర్థులు ముస్లిం జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగారు. మొగతా 17 స్థానాలకు అభ్యర్థులను పార్టీ నాయకత్వం త్వరలో ప్రకటించవచ్చు.

కాగా, గత ఎన్నికల్లో AIMIM జేడీఎస్ తో పొత్తు పెట్టుకుంది. అయితే ఈ సారి మాత్రం ఆ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనున్నది.

అయితే కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అవకాశం ఉన్న స్థానాల్లోనే AIMIM పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్ నాయకత్వం ఆందోళన చెందుతోంది. బీజేపీవ్యతిరేక ఓట్లను చీల్చి ఆ పార్టీని గెలిపించడం కోసమే MIM రంగంలోకి దిగిందని కర్నాటక కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. MIM పోటీ చేసిన అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నష్టపోయిందని, అక్కడ బీజేపీ గెలుపునకు MIM సహకరించి‍దని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News