కాగ్‌ కొత్త చీఫ్‌గా కె. సంజయ్‌ మూర్తి నియామకం

ఎల్లుండితో ముగియనున్న ప్రస్తుత కాగ్‌ చీఫ్‌ గిరిశ్‌ చంద్ర ముర్ము పదవీ కాలం

Advertisement
Update:2024-11-18 22:53 IST

భారత కంప్ట్రోలర్‌ అండ్‌ జనరల్‌ (కాగ్‌) చీఫ్‌గా ఐఏఎస్‌ అధికారి కె. సంజయ్‌ మూర్తి నియమితులయ్యారు. ప్రస్తుతం కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న ఆయనను కాగ్‌ చీఫ్‌గా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నియమించారు. ఈ మేరకు 1989 ఐఏఎస్‌ బ్యాచ్‌ హిమాచల్‌ప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన సంజయ్‌మూర్తి నియామకంపై కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం కాగ్‌ చీఫ్‌గా కొనసాగుతున్న గిరిశ్‌ చంద్ర ముర్ము పదవీ కాలం నవంబర్‌ 20 (ఎల్లుండి)తో ముగియనున్నది. దీంతో ఆయన స్థానంలో కె. సంజయ్‌ మూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. 

కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ భారతదేశంలో కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (CAG) ప్రజాధనానికి కాపలాదారుడిగా; కేంద్ర, రాష్ట్రస్థాయిలో దేశ ఆర్థిక వ్యవస్థకు రక్షకుడిగా వ్యవహరిస్తారు.భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం, యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మాదిరి కాగ్‌ ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం లాంటివారు.

Tags:    
Advertisement

Similar News