ఇప్పుడే ఢిల్లీలో ల్యాండ్‌ అయిన.. అప్పుడే వణికితే ఎలా?

'ఎక్స్‌' వేదికగా రేవంత్‌ సర్కార్‌పై కేటీఆర్‌ సెటైర్లు

Advertisement
Update:2024-11-11 17:18 IST

ఇప్పుడే ఢిల్లీలో ల్యాండ్‌ అయిన.. హైదరాబాద్‌ లో అప్పుడే ప్రకంపనలు వస్తున్నాయని విన్న.. అప్పుడే వణకితే ఎలా అని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 'ఎక్స్‌' వేదికగా సెటైర్లు వేశారు. అమృత్‌ టెండర్లలో అక్రమాలు సహా కొడంగల్‌ - నారాయణపేట్‌ లిఫ్ట్‌ స్కీం టెండర్లు, రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ అక్రమాలపై కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేయనున్నట్టు ప్రచారంలో ఉంది. ఇప్పటికే కేంద్ర పట్టాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా ఫిక్స్‌ అయ్యిందని ఢిల్లీ మీడియా వర్గాలు చెప్తున్నాయి. అమృత్‌ టెండర్లలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ పారదర్శకంగా వ్యవహరించలేదని, సీఎం సమీప బంధువుకు టెండర్లు కట్టబెట్టేలా అధికారాన్ని దుర్వినియోగం చేశారని కేటీఆర్‌ ఇటీవల ఆరోపణలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి చెందిన నిర్మాణ సంస్థ 'రాఘవ కన్స్‌స్ట్రక్షన్స్‌'కు కొడంగల్‌ నారాయణపేట లిఫ్ట్‌ స్కీం ఫస్ట్‌ ప్యాకేజీ, మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ లిమిటెడ్‌కు రెండో ప్యాకేజీ పనులు కట్టబెట్టడం, ఆ టెండర్లలో ప్రపంచ స్థాయి సంస్థలను టెక్నికల్‌ బిడ్‌ లో డిస్‌ క్వాలిఫై చేయడం, సుంకిశాల డ్రికింగ్ వాటర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంతో ఆ ప్రాజెక్టు రిటైనింగ్‌ వాల్‌ కూలిపోవడానికి కారణమైన మేఘా ఇంజనీరింగ్‌ సంస్థపై చర్యలు చేపట్టాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కేటీఆర్‌ ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. తాను ఢిల్లీలో అడుగు పెట్టానో లేదో ప్రభుత్వంలోని ముఖ్యుల్లో వణుకు మొదలైందని కేటీఆర్‌ పేర్కొనడం తెలంగాణతో పాటు ఢిల్లీ పొలిటికల్‌ సర్కిల్స్‌ లోనూ చర్చనీయాంశం అయ్యింది.

Tags:    
Advertisement

Similar News