నిన్న ఒక్క రోజులో జెఫ్ బెజోస్ కు80 వేల కోట్లు, ఎలాన్ మస్క్ కు 70 వేల కోట్ల నష్టం

ప్రపంచ కుబేరులు కొందరు నిన్న ఒక్క రోజులో వేల కొట్ల రూపాయల నష్టం చవి చూశారు. మంగళవారంనాడు అమెరికా స్టాక్ మార్కెట్ లు కుప్ప కూలడంతో జెఫ్ బెజోస్ 80 వేల కోట్ల రూపాయలు, ఎలాన్ మస్క్ 70 వేల కోట్ల రూపాయలు నష్టపోయారు.

Advertisement
Update:2022-09-14 15:44 IST

అమెరికాకు చెందిన సంపన్నులు కొందరు నిన్న ఒక్కరోజే వేల కోట్ల రూపాయలు నష్టపోయారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 80 వేల కోట్ల రూపాయలు, ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ 70 వేల కోట్ల రూపాయలు నష్టపోయారు.

అమెరికాలో ద్రవ్యోల్భణం అంచనాలకన్నా ఎక్కువ నమోదవ్వడంతో మంగళవారం స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలాయి. దాంతో అనేక కంపెనీల షేర్ల విలువ‌ భారీగా పడిపోయాయి. ఆ దెబ్బతో సంపన్నులు ఒక్క రోజులోనే వేల కోట్ల రూపాయలు నష్టపోయారు.

జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ లే కాక మార్క్ జుకెర్‌బర్గ్, లేరీ పేజ్, సెర్గీ బ్రియాన్, స్టీవ్ బల్ల్మెర్, బిల్ గేట్స్,వారెన్ బఫెట్ ల ఆస్తుల విలువ కూడా పతనమైంది.

మార్క్ జుకెర్‌బర్గ్, లేరీ పేజ్, సెర్గీ బ్రియాన్, స్టీవ్ బల్ల్మెర్ ఆస్తి విలువ 4 బిలియన్ డాలర్లు, వారెన్ బఫెట్ 3.4 బిలియన్ డాలర్లు, బిల్ గేట్స్ 2.8 బిలియన్ డాలర్లు చొప్పున సంపద నష్టపోయారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా పేర్కొంది.

అమెరికాలో ఆహార పదార్థాలు, ఇతర అత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో ద్రవ్యోల్బణం ఊహించనంతగా పెరిగిపోయింది.

Tags:    
Advertisement

Similar News